BigTV English

Venu Swamy: నేను చెప్పిన ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది.. వారి గురించి మళ్లీ చెప్పను: వేణు స్వామి

Venu Swamy: నేను చెప్పిన ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది.. వారి గురించి మళ్లీ చెప్పను: వేణు స్వామి

Venu Swamy Reaction On Andhra Pradesh Assembly Election Results: జ్యోతిష్యుడు వేణుస్వామి.. ఈ పేరు తరచూ వార్తల్లో నిలుస్తుంది. సినీ రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత, ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను చెప్తూ వైరల్ అవుతూ ఉంటారు. అదే క్రమంలో వివాదాలు, ట్రోల్స్‌కు కూడా గురవుతారు. అయితే ఇటీవల ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ట్విట్టర్ వేదికగా వేణుస్వామిపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ఏకదాటిగా కొనసాగుతున్నాయి.


అయితే అందుకు ప్రధాన కారణం ఉంది. అదేంటంటే.. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ విజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. దీంతో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా చాలా మంది నెటిజన్లు వేణుస్వామిపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విరుచుకుపడ్డారు.

అయితే ఇవాళ 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కూటమిగా ఏర్పడిన (టీడీపీ+జనసేన+బీజేపీ) విజయకేతనం ఎగురవేసింది. దీంతో జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్స్ తప్పు అయింది. దీంతో వేణుస్వామి రియలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు.


Also Read: ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ఓజీ టైమ్ స్టార్ట్ కాబోతుంది..

ఆ వీడియోలో తాను చెప్పిన ప్రెడిక్షన్స్ తప్పు అయిందని.. తాను ఇక నుంచి సినీ, రాజకీయ వ్యక్తుల వ్యక్తిగత విషయాలపై మరెప్పుడూ ప్రెడిక్షన్స్ చెప్పనని పేర్కొన్నాడు. ‘‘ఎన్నికల ఫలితాల గురించి దేశ వ్యాప్తంగా.. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రెడిక్షన్స్‌లో నరేంద్రమోడీ గారి ప్రభావం తగ్గుతుందని చెప్పాను. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది.

నాకున్నటువంటి విద్వత్తు, విజ్ఞానం నేను ప్రెడిక్షన్ చెప్పడం జరిగింది. నేను చెప్పినదాంట్లో సెంట్రల్‌లో నరేంద్ర మోడీ ఆధిపత్యం తగ్గడం అనేది ఒకటి జరిగింది. అలాగే రెండవది.. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పిన ప్రెడిక్షన్ తప్పింది. అయితే జనరల్‌గా జాతకం బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి నన్ను ట్రోల్ చేస్తున్నవాళ్లు, విమర్శిస్తున్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. అయితే ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రెడిక్షన్ 100 శాతం తప్పు అయింది.

దీనిని నేను కచ్చితంగా ఒప్పుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పిన ప్రెడిక్షన్స్ తప్పు అవడం వల్ల నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి రాజకీయ పరమైనటువంటి ప్రెడిక్షన్స్ కానీ, అలాగే సినిమాకు సంబంధించి, వ్యక్తిగతమైన పర్సన్స్‌కు సంబంధించి ప్రెడిక్షన్స్ కానీ.. ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తున్నాను.

Also Read: చెప్పాడు.. చేసాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది: సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

జగన్మోహన్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు జాతకం విశ్లేషనలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇకనుంచి పబ్లిక్ ప్లాట్ ఫార్మ్‌లలో ఎవరి వ్యక్తిగతానికి సంబంధించి ఎలాంటి ప్రెడిక్షన్స్ చెప్పను. కావున ఇన్ని రోజులు నన్ను సహకరించి, నాతో ఉన్నవారికి చాలా ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×