Allu Arjun Pushpa 2 :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి(Venu Swamy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలిచారు. ఎప్పుడైతే నాగచైతన్య(Naga Chaitanya) , సమంత(Samantha)విడిపోతారని చెప్పారో.. ఇక ఆయన చెప్పినట్టుగానే వారు విడిపోయారు. దాంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు వేణు స్వామి. అయితే ఈయన చెప్పిన ప్రతి ఒక్కరి జాతకం నిజమైందా అంటే..? లేదనే చెప్పాలి. ఒక్కొక్కసారి ఈయన సెలెబ్రిటీలపై చెప్పిన జాతకాలు బెడిసి కొట్టాయి. ముఖ్యంగా రాజకీయాలపై ఈయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.
సెలబ్రిటీల జాతకాలపై స్పందించను – వేణు స్వామి
ఇకపోతే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఘోర పరాభవం చవిచూస్తుందని, మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందని జ్యోతిష్యం చెప్పారు వేణు స్వామి. కానీ ఈయన జ్యోతిష్యం రివర్స్ అయ్యింది. దాంతో చాలామంది ఈయనపై విమర్శలు గుప్పించారు. ఇక ఫలితంగా మీడియా ముందుకు వచ్చిన వేణు స్వామి అప్పటినుంచి సెలబ్రిటీల జాతకం గురించి చెప్పను అంటూ కామెంట్ చేశారు. అయితే సడన్గా పుష్ప -2 సినిమాపై కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
మరో 15 ఏళ్లు అల్లు అర్జున్ కు రాజయోగం..
గతంలోనే పుష్ప-2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణు స్వామి, ఇప్పుడు మళ్లీ పుష్ప-2 సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. వేణు స్వామి గతంలో సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనని చెప్పి , ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం పై స్పందించారు. గంగమ్మ జాతర సీన్లో అల్లు అర్జున్ రాజా మాతంగి గెటప్ లో ఇరగదీసారని కొనియాడారు. తాను గతంలో అల్లు అర్జున్ జాతకం గురించి చెప్పిన వీడియోలను పోస్ట్ చేశారు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్.. మరో 15 ఏళ్లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు. బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరూ కూడా నష్టపోరు అంటూ వేణు స్వామి పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. మిగితా సినిమా లవర్స్ మాత్రం వేణు స్వామి పై విరుచుకుపడుతున్నారు. ఇన్ని రోజులు జాతకాలు చెప్పనని ఇప్పుడు మాట తప్పాడు అంటూ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం.
రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప-2..
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. 2021లో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క బాలీవుడ్ లోనే రూ.100కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన పుష్ప-2 డిసెంబర్ ఐదవ తేదీన విడుదలై ఊహించిన రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది . అంతే కాదు ఈ దెబ్బకు ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయని చెప్పవచ్చు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">