Veena Srivani: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి రెండు తెలుగురాష్ట్ర పరాజయాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నేతలకు, సెలబ్రిటీలకు జాతకం చెప్తూ.. భవిష్యత్తులో వారి జీవితం ఎలా ఉండబోతుందో చెప్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. సమంత – నాగ చైతన్య నాలుగేళ్లకే విడిపోతారని చెప్పింది వేణుస్వామినే. ఆ తరువాత ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది.
ఇక అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ గెలుస్తాడని చెప్పి శపథం చేశాడు. కానీ, చివరకు పవన్ కళ్యాణ్ గెలవడంతో .. రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు.. ఇకనుంచి రాజకీయ నేతలకు సంబంధించి జాతకాలను చెప్పనని తేల్చి చెప్పాడు. ఇక ఈ మధ్యనే .. టీవీ 5 మూర్తి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రూ. 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. లేకపోతే తనపై డబ్బులిచ్చి డిబేట్ పెట్టించి పరువు తీస్తున్నారని, దీనికి తమ చావే శరణ్యమని.. వేణుస్వామి, అతని భార్య వీణ శ్రీవాణి ఒక వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన విషయం విదితమే.
నిజం చెప్పాలంటే.. ఈ వీడియో రిలీజ్ అయ్యేవరకు కూడా వేణుస్వామి భార్య వీణ శ్రీవాణి మీద ఎవరికి కోపం లేదు. ఆమె టాలెంట్ ను అందరు మెచ్చుకున్నవారే. అంబానీల పెళ్లిలో కూడా ఆమె వీణ ప్రోగ్రామ్ చేయడంతో ఎంతోమంది ఆమెను ప్రశంసించారు. కానీ, ఈ వీడియో తరువాత అంతా మారిపోయింది. భర్తను వెనకేసుకొని వస్తూ.. ఆమె మాట్లాడిన మాటలు ఎంతోమందికి కోపం తెప్పించాయి. భర్తను ఏమి అనలేక.. మిగతావారిపై పడుతుందని నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
ఇక తాజాగా మరోసారి వీణ శ్రీవాణి.. ఒక వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తున్న తిరుపతి లడ్డూ వివాదం గురించి ఆమె మాట్లాడింది. తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపణలు వచ్చిన తరుణంలో నేడు సుప్రీం కోర్టు ఫైర్ అయిన విషయం తెల్సిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు ఆధారాలు ఎక్కడ ఉన్నాయని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా దేవుళ్లను రాజకీయం చేయొద్దని తెలిపింది.
ఇక దీనిపై వీణ శ్రీవాణి మాట్లాడుతూ.. ” పరమ పవిత్రమైన ఆ తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. భక్తుల మనోభావాలను ఎంత హింసించారు. సరే, పొలిటీషియన్స్ పక్కన పెట్టేద్దాం. ప్రవచన కర్తలు, పండితులు, బ్రాహ్మణులు.. ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు.. ఏమైనా ఓవర్ యాక్షన్ చేశారా.. ? మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలు అంట.. వాళ్లే కనిపెట్టేసి, ఆ శ్లోకాలు చెప్పించేసి.. మాములు రచ్చ చేయలేదు. ఎంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారో తెలుసా.. ? ఇప్పుడేం చేస్తారు మీ అందరు. మీరు నిజమైన హిందువులు అయితే.. మీరు నిజంగా స్వామివారి భక్తులు అయితే.. మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా.. ? పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు.