మూవీ మొగల్ రామానాయుడు.. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మహావృక్షంలా నిలబడ్డాడు. ఆయన నట వారసుడిగా చిన్న కొడుకు.. దగ్గుపాటి వెంకటేష్ 1986 లో కలియుగ పాండవులు అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. పరుస విజయాలతో విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకొని విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు వెంకటేష్. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్న పక్క ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వెంకటేష్.
కాంట్రవర్సీలకి దూరంగా ఉండే వెంకటేష్ కు టాలీవుడ్ లో అజాతశత్రువు అని కూడా పేరు ఉంది. తన సినీ కెరీర్లో.. ఎన్నో మంచి చిత్రాలలో నటించడమే కాకుండా వైవిధ్యమైన తన నటనతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు వెంకీ. ఇక తన మూవీస్ ద్వారా ఎందరో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశాడు.
వెంకటేష్ 1960.. డిసెంబర్ 13న ప్రకాశం జిల్లాలోని కారంచేడు లో జన్మించారు. ఆ తర్వాత.. వెంకీ విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకమలం చిత్రంలో నటించి.. ప్రశంసలు అందుకున్నాడు. అదే సంవత్సరం విడుదలైన వారసుడొచ్చాడు చిత్రం అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బొబ్బిలి రాజా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో వెంకీ ఇక మళ్ళీ తిరిగి చూసుకోలేదు. వెంకటేష్ ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్ రాఘవేందర్ రావ్ అయితే.. హిట్ పెయిర్ అనిపించుకున్న హీరోయిన్ మాత్రం దివంగత నటి సౌందర్య.
వెంకటేష్ తెలుగు తెరకు పరిచయమైన కలియుగ పాండవులు చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కూడా రాఘవేందర్ రావే.. అలా వాళ్ల హిట్ పెయిర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మొదటి చిత్రం కలియుగ పాండవులలో వెంకీ నటనకు నూతన కథానాయకుడిగా నంది అవార్డు లభించింది. ఆ తరువాత గణేష్ ,స్వర్ణకమలం ,చంటి ,ధర్మచక్రం ,ప్రేమ, కలిసుందాం రా ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే లాంటి సినిమాలకు కూడా వెంకటేష్ నంది అవార్డు అందుకున్నాడు.
ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో తీస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు వెంకటేష్. అందుకే అతనికి మహిళలలో ఫాలోయింగ్ ఎక్కువ. వెంకీ సినిమా వచ్చిందంటే చాలు సకుటుంబ సపరివార సమేతంగా కలిసి చూడాల్సిందే. అతని సినిమాల్లో సీరియస్నెస్ ,యాక్షన్ తో పాటు కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే అన్ని రకాల ప్రేక్షకులకి వెంకీ సినిమా అంటే అంత ఇష్టం.
సినీ ఇండస్ట్రీలో వివాదరహితంగా ఉండే యాక్టర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు వెంకటేష్. తన పర్సనల్ లైఫ్ ను.. ప్రొఫెషనల్ లైఫ్ ని ఎక్కువగా మిక్స్ చేయకుండా జాగ్రత్తగా ఉంటాడు.తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలు ఎక్కువగా మీడియా దగ్గరకు రాకుండా జాగ్రత్త తీసుకునే నటుడు వెంకటేష్.. అతని కుటుంబం ఎప్పుడూ లైమ్ లైట్‌కు దూరంగా ఉంటుంది. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో మంచి క్రేజ్ మీద ఉన్న ఈ స్టార్ త్వరలో సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.
ఫ్యామిలీ స్టార్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు.