Cinnamon Tea: దాల్చిన చెక్క టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కేవలం కారంగా ఉండి ఆహార పదార్థాల యొక్క రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం టీలో కలిపి తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
దాల్చిన చెక్క టీ బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా.. రక్తంలో చక్కెర నియంత్రణ, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో.. ఈ టీ శరీరాన్ని తేలికగా ,చురుగ్గా ఉంచుతుంది.
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కలిగే 6 ప్రయోజనాలు:
చక్కెర స్థాయి నియంత్రణ:
టైప్-2 డయాబెటిస్ రోగులకు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. తద్వారా శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి.
జీవక్రియ:
దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మీరు ఈ టీ తాగినప్పుడు అది కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
జీర్ణక్రియ:
గ్యాస్, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యలను తొలగించడంలో దాల్చిన చెక్క టీ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అంతే కాకుండా ఆహారాన్ని వేగంగా, మెరుగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అజీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు తరచుగా ఈ టీ తాగడం వల్ల సమస్య నుండి ఈజీగా బయటపడేటందుకు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం:
దాల్చిన చెక్కలో లభించే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును సమతుల్యం చేయడంలో , చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా హృదయ సంబంధ ప్రమాదాలను తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు తరచుగా దాల్చిన చెక్క టీ తాగడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి తరచుగా వ్యాధుల బారిన పడే వారు దాల్చిన చెక్క టీ తాగడం చాలా మంచిది.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. మనీ ప్లాంట్ తొందరగా పెరుగుతుంది తెలుసా ?
చర్మానికి మేలు:
దాల్చిన చెక్క టీ శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. దీనివల్ల చర్మం శుభ్రంగా , ప్రకాశవంతంగా మారుతుంది. ఇది మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం కోసం దాల్చిన చెక్క టీ తాగడం మంచిది.