Vidaa Muyarchi Release Date: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తే సెంటిమెంట్ ప్రకారం అవి బాగా వర్కవుట్ అవుతాయని నమ్మే మేకర్స్ కూడా ఉంటారు. అందుకే ఈ పండగకు ఎంత సినిమాల పోటీ ఉన్నా కూడా మరొక సినిమా యాడ్ అవుతూనే ఉంటుంది. 2025 సంక్రాంతికి తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అసలైతే అజిత్ హీరోగా తెరకెక్కిన ‘విడా ముయర్చి’ కూడా సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా కొత్త విడుదల తేదీ కూడా బయటపెట్టారు.
గుడ్ న్యూస్
అజిత్ హీరోగా నటించిన ‘విడా ముయర్చి’ చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. అసలైతే ఈ మూవీ 2024 దీపావళికే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల ఉంటుందని ప్రకటించారు. కానీ అప్పుడు కూడా రిలీజ్ చేయడం కష్టమని భావించిన మేకర్స్.. రిలీజ్ డేట్‌ను సస్పెన్స్‌లో పెట్టారు. ఫ్యాన్స్‌లో డిసప్పాయింట్ చేయకూడదు అనే ఉద్దేశ్యంతో అసలు సంక్రాంతికి ఈ సినిమా ఉంటుంది అన్నట్టుగానే ప్రవర్తించారు. కానీ ఆడియన్స్‌కు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి సంక్రాంతికి ‘విడా ముయర్చి’ విడుదల కావడం లేదని ఫీల్ అవుతున్న అజిత్ ఫ్యాన్స్‌కు వెంటనే గుడ్ న్యూస్ ఎదురయ్యింది.
Also Read: విశాల్ ఆరోగ్యం పై వదంతులు.. స్పందించిన మేనేజర్..!
వారం లేటు
సంక్రాంతికి ‘విడా ముయర్చి’ (Vidaa Muyuarchi) తప్పుకున్నా కూడా వెంటనే వారంలోపే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. జనవరి 23న ఈ మూవీ విడుదల కానుందని ప్రకటించారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ మళ్లీ హ్యాపీ అయ్యారు. ఈసారి ఈ మూవీ పోస్ట్‌పోన్ అయితే మళ్లీ అజిత్‌ను స్క్రీన్‌పై చూడడానికి ఎన్ని నెలలు ఆగాలో అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు. కానీ వారం రోజులు మాత్రమే లేట్ అవ్వడంతో కాస్త పరవాలేదని అనుకుంటున్నారు. మొత్తానికి చాలాకాలం తర్వాత ‘విడా ముయర్చి’ అనే కమర్షియల్ మూవీస్‌తో ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడానికి వచ్చేస్తున్నాడు అజిత్ (Ajith). ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ మూవీపై బజ్ బాగానే ఉంది.
రన్ టైమ్ రివీల్
మగిర్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన సినిమానే ‘విడా ముయర్చి’. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా త్రిష నటించింది. అర్జున్, ఆరవ్చ రెజీనా.. ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ మూవీ ‘బ్రేక్ డౌన్’ ఇన్‌స్పిరేషన్‌తోనే ‘విడా ముయర్చి’ తెరకెక్కించారని సమాచారం. ఇది పూర్తిగా రీమేక్ కాకపోయినా.. రెండు సినిమాల్లో చాలా పోలికలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి కాగా.. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. మొత్తంగా 150 నిమిషాలు అంటే 2 గంటల 30 నిమిషాల రన్ టైమ్ కూడా లాక్ చేసుకుంది. డిసెంబర్ 23న ఈ మూవీని థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి అజిత్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.