Arshdeep Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం ప్రారంభమైంది. ఈ మెగా వేలంలో..మొట్టమొదటగా… అర్ష్‌దీప్ సింగ్ వేలంలోకి వచ్చాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్ ను కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీపడ్డాయి.
Also Read: IPL Auction 2025: రేపే వేలం.. అందరికన్ను ఈ వికెట్ కీపర్లపైనే.. పంత్ పై కోట్ల వర్షం గ్యారెంటీ?
ఈ తరుణంలోనే అర్ష్‌దీప్ సింగ్ ను ఆర్టిఎం కార్డు వాడి పంజాబ్ కింగ్స్ మరోసారి కొనుగోలు చేసింది. దీంతో అతనికి 18 కోట్లు గతంలోనే ఇచ్చినట్లుగా ఇవ్వనుంది పంజాబ్ కింగ్స్.
వాస్తవంగా పంజాబ్ కింగ్స్ కు చెందిన…అర్ష్‌దీప్ సింగ్ ను…ముందే కొనుగోలు చేయాలని స్కెచ్ వేసిందట ఆ జట్టు యాజమాన్యం. అందుకే ఆర్టీఎం కార్డు వాడి మరి అతన్ని గెలుచుకుంది. ఇక రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి ఈసారి అర్ష్‌దీప్ సింగ్ రావడం జరిగింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్..టి20 లో అద్భుతంగా రాణించగలుగుతాడు.
Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్..!
అందుకే అర్ష్‌దీప్ సింగ్ కోసం వేలంలో చాలా యాజమాన్యాలు…పోటీపడ్డాయని చెప్పవచ్చు. సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అతని కోసం పోటీపడ్డాయి. చివర్లో సన్రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్…అతనిపై 15 కోట్లకు పైగా పెట్టాలని..వేలం పాట పాడాయి. కానీ చివరికి…అర్ష్‌దీప్ సింగ్ ను ఆర్టియం కార్డు ద్వారా పంజాబ్ కింగ్స్ గెలుచుకుంది.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. అర్ష్‌దీప్ సింగ్ (18 కోట్లు; RTM)
2. శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు)
3. యుజ్వేంద్ర చాహల్ (రూ. 18 కోట్లు)
4. మార్కస్ స్టోయినిస్ (రూ. 11 కోట్లు)
5. గ్లెన్ మాక్స్‌వెల్ (రూ. 4.2 కోట్లు)
6. నేహాల్ వధేరా (రూ. 4.2 కోట్లు)
7. హర్‌ప్రీత్ బ్రార్ (రూ. 1.5 కోట్లు)
8. విష్ణు వినోద్ (రూ. 95 లక్షలు)
9. విజయ్‌కుమార్ వైషాక్ (రూ. 1.8 కోట్లు)
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల పూర్తి జాబితా: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్
విడుదలైన ఆటగాళ్ల పూర్తి జాబితా: శిఖర్ ధావన్ (రిటైర్డ్), జితేష్ శర్మ, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ భాటియా, రిలీ రోసౌవ్, క్రిస్ వోక్స్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అశుతోష్ శర్మ, తనయ్ త్యాగరాజన్, అథర్వ తైదే, సామ్ సిదర్ ధావన్, సికాన్ రిషి ధావన్ రజా, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, విద్వాత్ కవేరప్ప, హర్షల్ పటేల్