BigTV English

Kingdom Release Date : కింగ్ డం వాయిదాకు అసలు కారణం ఇదా..? మరి ప్రొడ్యూసర్లు ఇలా చెప్పారేంటి..?

Kingdom Release Date : కింగ్ డం వాయిదాకు అసలు కారణం ఇదా..? మరి ప్రొడ్యూసర్లు ఇలా చెప్పారేంటి..?

Kingdom Release Date: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులు అంచనాలను పెంచేసింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా కొన్ని మూవీస్ ని వాయిదా వేయడం జరుగుతుంది.. ఈ ప్రభావం ఇప్పుడు టాలీవుడ్ పైన పడింది. కింగ్డమ్ మే 30 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించగా, ఇప్పుడు కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే చివరికి ఈ మూవీ జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అసలు మేకర్స్ మూవీ వాయిదా వేయడానికి చెప్పిన కారణం ఒకటైతే.. అసలు పోస్ట్ పోన్ చేయడానికి మరో కారణం ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.. అదేంటో చూద్దాం.


కింగ్‌డం వాయిదాకు అసలు కారణం ఇదా..

విజయ్ దేవరకొండ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్ కి వెళ్లి చూడాలా అని ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మూవీ మే 30 నుండి జూన్ 4 వాయిదా వేయడంతో ఫాన్స్ నిరాశ చెందారు. అయితే మూవీ వాయిదా వేయడంకు ఇండియా – పాక్ వార్ కారణమని మేకర్స్ తెలిపారు. ముందుగా అనుకున్నట్లు మేము ఈ సినిమా తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాము. దేశంలో ప్రస్తుతం ఇండియా -పాక్ యుద్ధం తో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమోషన్స్ వేడుకలు చేయడం కొంచెం కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాని మే 30న కాకుండా జూన్ 4న విడుదల చేయనున్నామని, చిత్ర యూనిట్ తెలిపించి.. ఈ గ్యాప్ లో ఈ మూవీని ఇంకొంత బెటర్ గా మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుందని మేము అనుకుంటున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చిన కింగ్డమ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గకుండా ఉంటుంది. జులై 4న థియేటర్లో అడుగు పెడుతున్న ఈ చిత్రానికి మీ ప్రేమ, ఆదరణ కావాలి అని అభిమానులకు మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఇక్కడ దేశంలో ఉన్న పాకిస్తాన్ -ఇండియా వార్ జరుగుతున్న కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని నిర్మాతలు తెలియజేస్తున్నారు. అసలు విషయం అది కాదని.. మూవీ వాయిదా పడడానికి ప్రధాన కారణం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, టాక్.. నిర్మాతలు వార్ కారణంగా వాయిదా వేసినట్లు చెప్పారు కానీ, సినిమా బ్యాక్ ఎండ్ లో పూర్తి కావాల్సిన పనులు ఇంకా ఉన్నాయని.. అందుకే జూన్ 4 కి వాయిదా వేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇండియా పాక్ యుద్ధమే కారణమైతే అది ముగిసింది. ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు కానీ, జూన్ 4 వరకు వాయిదా వేయాల్సిన అవసరం లేదు కదా అని సాధారణ ప్రేక్షకుడు కూడ ప్రశ్నించే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిర్మాతలు చెప్తున్నట్లు యుద్ధం కారణమైన కావచ్చు, లేదంటే మూవీలో ఇంకా పెండింగ్ ఉన్న పనులు అయినా కావచ్చు. మూవీ అయితే వాయిదా పడింది. ఈ వార్తతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.


మూవీ కోసం ఫాన్స్ వెయిటింగ్ ..

విజయ్ దేవరకొండ గత సంవత్సరం ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్ పై పరుశురాం దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ కింగ్డమ్ పైనే ఉన్నాయి. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్, టీజర్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×