Nani: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ హిట్ 3. హిట్ సిరీస్ లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ యునాన్మిస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంతి తీపిర్నెని నిర్మించారు. ఈ సినిమా మే1న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచేశాయి. హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, నాని నెక్స్ట్ మూవీ గురించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు నాని ఏమన్నాడంటే..
ఇద్దరు హీరోల సినిమాలు..బ్లాక్ బస్టర్..
హిట్ మొదటి భాగం, రెండవ భాగం సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. సీక్వెల్స్ లో భాగంగా వస్తున్న హిట్ 3 బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో పారడైస్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా నాని హిట్3 ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పారడైస్ చిత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ చేస్తున్నట్లు, సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెడతామని ఆయన తెలిపారు. అదే టైం కి రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్ లో సందడి చేసినా, ఎటువంటి సమస్య ఉండదు అంటూ నాని రెండు సినిమాలు బాగా ఆడతాయని నాని తెలిపారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీతో మన ముందుకు రానున్నారు. ఈ రెండు చిత్రాలలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఇదే కోవలో సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి రెండు సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. అలాగే నెక్స్ట్ సమ్మర్ కి నాని పారడైజ్, రామ్ చరణ్ పెద్ది ఒకేరోజు రిలీజ్ అయినా ఎలాంటి సమస్య ఉండదు అని నాని తెలిపారు.
ఆ రెండు సినిమాలు అప్పుడే రిలీజ్ ..
ఇక నాని ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి వచ్చారు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలుపెట్టి ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా, నిర్మాతగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. నాని నటించిన మూవీస్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తాయి. ఇక పారడైజ్ సినిమా విషయానికి వస్తే.. 2026 లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా బడ్జెట్ నాని కెరియర్ లోనే అత్యధికంగా ఉంటుందని సమాచారం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది కూడా టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ రెండు చిత్రాలు 2026 సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bellamkonda Sai Sreenivas: కిష్కిందపురి గ్లింప్స్ భయానకం.. బెల్లంకొండ శ్రీనివాస్ మరో యాంగిల్..