Vijay Thalapathy.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) మరికొన్ని రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి, రాజకీయాలలోకి వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులో ‘తమిళగా వెట్రి కళగం’ అనే సొంత పార్టీని కూడా పెట్టి పూర్తిస్థాయి రాజకీయాలకు సిద్ధమవుతున్నారు. ఇక పార్టీని అనౌన్స్ చేసిన సమయంలోనే విజయ్ 2026 లో తమిళనాడులో జరిగే ఎన్నికల బరిలో పోటీ చేస్తానని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చివరిగా ‘జననాయగన్’ అనే సినిమా చేసి, ఇక పూర్తిగా రాజకీయ రంగంలోనే స్థిరపడిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా తన అభిప్రాయాలను సూటిగా చెబుతూ వస్తున్నారు విజయ్.
ప్రమాదంలో కోలీవుడ్ హీరో విజయ్..Y+ భద్రత ఏర్పాటు..
ఇలాంటి సమయంలో విజయ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయనకు ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలోనే కేంద్రం Y+ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రాజకీయంగా విజయ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలోనే ఆయనకు Y + కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించనుంది. అయితే ఇది దేశంలోనే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత..
భద్రత కేటగిరి ఎన్ని రకాలంటే..?
మొదటి భద్రతా విభాగం SPG. ఇది ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతికి ఈ సెక్యూరిటీ కల్పిస్తారు. అలాగే వారికి ఎదురయ్యే భద్రతను బట్టి అందులో భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. ఇక రెండో కేటగిరీ Z+.. ఇది మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధానులతో పాటు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్న నాయకులకు మాత్రమే ఈ భద్రతను కల్పిస్తారు.
ఇక మూడవది Z కేటగిరీ.. ఇక నాలుగవది Y+ కేటగిరీ. ఈ భద్రతలు మొత్తం 11 మంది ఉంటారు. అందులో నలుగురు కమాండోలు, మిగిలిన వారు పోలీసులు ఈ భద్రత కోసం నెలకు రూ. 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
Y+ కేటగిరీ భద్రత కలిగి ఉన్న సెలబ్రిటీస్..
ఇప్పటికే సల్మాన్ ఖాన్ (Salman Khan), కంగనా రనౌత్ (Kangana Ranaut), షారుక్ ఖాన్ (Shahrukh Khan) లకు ఈ కేటగిరి భద్రతను కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ కి కూడా కేంద్రం ఈ తరహా భద్రత కల్పించడంతో ఆయనకు ఎవరి నుండి ప్రాణహాని ఉంది? అనే కోణంలో అభిమానులు సైతం ఆశ్చర్యంతో పాటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దళపతి కెరియర్..
విజయ్ దళపతి కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన ప్లే బ్యాక్ సింగర్ కూడా.. ఎక్కువగా కోలీవుడ్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఇప్పటివరకు 68 సినిమాలు చేసి మంచి విజయం సొంతం చేసుకున్నారు. అంతేకాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ యాక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన సినిమాలు తమిళ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలుగా నిలిచాయి. ఇక 1984లో వెట్రీ అనే సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. నాలయ తీర్పు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు.