BigTV English
Advertisement

Vishal: 13 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమయిన విశాల్ సినిమా.. మరీ ఇంత లేటా.?

Vishal: 13 ఏళ్ల తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమయిన విశాల్ సినిమా.. మరీ ఇంత లేటా.?

Vishal: కథ రాసుకున్నప్పటి నుండి ఒక సినిమా సెట్స్‌పైకి వెళ్లి ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఇక అది పాన్ ఇండియా సినిమా అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ కొన్నిసార్లు షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలు కూడా విడుదలవ్వడం కష్టమవుతుంది. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ సినిమా గురించి మేకర్సే మర్చిపోవచ్చు. అలా కొన్ని కొన్ని చిత్రాలు విడుదల అవ్వడానికి కొన్నేళ్లు పడతుంది. విశాల్ హీరోగా నటించిన ఒక సినిమా 13 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తిచేసుకొని ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.


అధికారిక ప్రకటన

విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘మద గజ రాజా’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. ఇంతకాలం అసలు ఈ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 12న ‘మద గజ రాజా’ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన సమచారాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్. సుందర్ సీ ‘మద గజ రాజా’ను డైరెక్ట్ చేశారు. మరి ఇంతకాలం ఈ మూవీ రిలీజ్ అవ్వకపోవడానికి కారణమేంటి.?


Also Read: ‘మహానటి’ సినిమాను రిజెక్ట్ చేయాలనుకున్న కీర్తి సురేశ్.. అదే కారణమా.?

అదే కారణం

2012లో ‘మద గజ రాజా’ (Madha Gaja Raja) ప్రొడక్షన్ మొదలుపెట్టుకుంది. 2013లో షూటింగ్ పూర్తయ్యింది. అదే ఏడాదిలో సినిమా విడుదల కూడా కావాల్సింది. కానీ అలా జరగలేదు. అంతే కాకుండా 11 ఏళ్ల క్రితమే ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాలో కలిసి నటించిన తర్వాతే విశాల్ (Vishal), వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రేమలో పడ్డారు. కానీ పలు కారణాల వల్ల కొన్నాళ్లకే విడిపోయారు కూడా. కానీ ఈ మూవీ మాత్రం వారికి స్పెషల్‌గా మిగిలిపోయింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకపోవడానికి బడ్జెట్ సమస్యలే కారణమని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

సినిమాల పోటీ

విజయ్ ఆంటోనీ ‘మద గజ రాజా’కు సంగీతం అందించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ దీనిని నిర్మించింది. విశాల్, సుందర్ సీ (Sundar C) కాంబినేషన్‌లో అప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంబల’, ‘యాక్షన్’ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ‘మద గజ రాజా’ మాత్రమే ఇంకా థియేటర్లలో విడుదల కాకుండా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇక ఈ సంక్రాంతి తమిళం నుండి దాదాపుగా 6 నుండి 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘విడాముయర్చి’ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న పలువురు యంగ్ హీరోలు మాత్రం సంక్రాంతిపైనే కన్నేసి రెడీగా ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×