Viswak Sen : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Viswak Sen) గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. డైరెక్టర్ మళ్లపూడి రవితేజ (Mallapudi RaviTeja) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో మాట్లాడిన మాటలు ఎంత వివాదంగా మారాయో చూసాము. అతని స్పీచ్ కు సంబందించిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎప్పుడు మాస్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు కామెడీ సినిమాలను చెయ్యనున్నాడని తెలుస్తుంది. జాతిరత్నాలు మూవీతో అదరగొట్టిన అనుదీప్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు విశ్వక్ సేన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.. త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇదే బ్యానర్ లో అనుదీప్ డైరెక్షన్ లో రవితేజతో సినిమా రావాల్సి ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇది రవితేజకు చెప్పిన కథా లేక వేరేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించబోతోంది. ఇప్పటికే తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు..
ఇక ఈ మూవీ గురించి తెలిసినప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కామెడీ డైరెక్టర్ తో ఫన్నీ మూవీ చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నారు. ఇలా మారిపోయాడేంటి అని ఆందోళన పడుతున్నారు. ఏది ఏమైనా అలాంటి సినిమాలో విశ్వక్ సేన్ ఎలా నటిస్తాడో అని ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక ఈయన నటిస్తున్న మెకానిక్ రాకీ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత లైలా అనే సరికొత్త కాన్సెఫ్ట్ తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీలో అమ్మాయిలాగా కనిపించబోతున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం..