BigTV English

OTT Movie : “వకీల్ సాబ్”లాంటి కిక్ ఇచ్చే తమిళ కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : “వకీల్ సాబ్”లాంటి కిక్ ఇచ్చే తమిళ కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో సక్సెస్ గా స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి .


డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ (Disney + hotstar)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఫైండర్” (Finder). ఇది ఒక తమిళ్ మూవీ. ఏ తప్పు చేయని కొంతమంది జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్లను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు ఈ మూవీలో హీరో హీరోయిన్. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్  ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక కాలేజ్ లోకి సెమినార్ ఇవ్వడానికి దయానంద్ అనే వ్యక్తి వస్తాడు. అతడు మీ గోల్స్ ఏంటని స్టూడెంట్స్ ను అడుగుతాడు. అందరూ తమ గోల్స్ చెప్తారు. అయితే వాసు అనే వ్యక్తి అన్యాయంగా చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తున్న నిరుపేదలను బయటకు తీసుకువచ్చే ఏజెన్సీని స్థాపించి, అటువంటి వాళ్లకు న్యాయం చేస్తానని చెప్తాడు. అతనిని అందరూ అభినందిస్తారు. ఈ క్రమంలోనే వాసు, నిత్య అనే అమ్మాయితో కలిసి ఫైండర్ అని ఏజెన్సీని స్థాపిస్తాడు. ఒకరోజు ఈ ఏజెన్సీ యాడ్ ను పేపర్ లో పాయల్ అనే అమ్మాయి చూస్తుంది. వాళ్లకు ఫోన్ చేసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తుంది. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పీటర్ అనే వ్యక్తి ఒక ఫ్రాడ్ కంపెనీలో కొంత డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా, అతడు ఉన్న ఊరిలో చాలామంది చేత డబ్బులు కట్టిపిస్తాడు. ఆ కంపెనీ మోసం చేయడంతో, ఆ ఊరి జనం డబ్బులు నువ్వే ఇవ్వాలంటూ పీటర్ కు వార్నింగ్ ఇస్తారు.

ఒక మర్డర్ కేసును పీటర్ తన మీద వేసుకుంటే ఒక లాయర్ ఐదు లక్షలు ఇస్తానని చెప్తాడు. అప్పులు తీరుతాయనే ఉద్దేశంతో, పీటర్ ఆ మర్డర్ ను తన మీద వేసుకొని జైలుకు వెళ్తాడు. ఆ తరువాత లాయర్  నువ్వు నిర్దోషి అని నిరూపించి మళ్లీ బయటికి తెస్తామని చెప్తాడు. ఈ క్రమంలో అతడిని కోర్టులో లాయర్ నిర్దోషిగా నిరూపించలేక పోతాడు. అతడు జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఈ కేసు విషయమై పీటర్ కూతురైన పాయల్ ఫైండర్ ఏజెన్సీని కలుస్తుంది. వాసు, నిత్య ఈ కేసును ఛేదించే క్రమంలో వాళ్లకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? వాసు, నిత్య కలసి పీటర్ ని నిర్దోషిగా నిరూపిస్తారా? చివరికి ఆ ఊరిలో పీటర్ అప్పులు తీరుస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటిలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఫైండర్” (Finder) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిలనే ముట్టుకోని ఆణిముత్యం… ఆటిజం ఉన్నా అదిరిపోయే ట్రీట్మెంట్ చేసే డాక్టర్… ఒక్కో కేసులో ఒక్కో అద్భుతం

OTT Movie : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

OTT Movie : జుట్టు పట్టుకుని కొట్టుకునే తల్లీకూతుర్లు… అపర కుబేరులే కానీ అంతులేని వింతలున్న ఫ్యామిలీ

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

Big Stories

×