Karimnagar Crime News: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణ హత్య జరిగింది. మిత్రుడే ఆ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. ఆపై తన పగ తీర్చుకున్నాడు. రక్తం మరకలతో కూడిన గొడ్డలితో నడిరోడ్డులో ప్రదర్శన చేశాడు. ఇంతకీ స్థానికులను భయపెట్టాడా? అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్టోరీలోకి వెళ్తే..
మృతుడు పరశురాం వేములవాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహేష్ వద్ద కొంతకాలం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన వయస్సు 35 ఏళ్లు. నాగయ్యపల్లి గ్రామానికి చెందిన పరశురాంకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు కూతురు, మరొకరు కొడుకు. పట్టణంలో బైపాస్ రోడ్డులోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ ఆదివారం సాయంత్రం ఈ హత్య జరిగింది.
నిందితులు రెండు గొడ్డళ్లు, ఒక కత్తితో పరశురాంను నిర్దాక్షిణ్యంగా మెడ,తలపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. స్పాట్ లో ఆయన మృతి చెందాడు. ఈ విషయంలో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పరశురాం మృతి చెందాడు.
డ్రగ్స్, గంజాయి గ్యాంగ్స్ పనేనా?
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన ఎందుకు జరిగింది? స్నేహితుడు బైరెడ్డితో పరశురాం ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఉంటే ఆయన పిలిచిన వెంటనే ఎందుకు వెళ్తాడు అన్నది మరో పాయింట్. పోలీసు ప్రాథమిక విచారణలో మాత్రం డ్రగ్స్, గంజాయి గుంపుల మధ్య అంతర్గత వివాదంగా చెబుతున్నారు.
ALSO READ: డైమండ్ వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్, భారత్‌కు వస్తాడా?
బాధితుడి కుటుంబ సభ్యుల వెర్షన్ మరోలా ఉంది. మద్యం మత్తులో కొనాయిపల్లికి చెందిన బైరెడ్డి ఆదివారం పరశురాం ఇంటికి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్దకు పరశురాంను తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా నరికి చంపాడని మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు బైరెడ్డి గతంలో పరశురాంకు స్నేహితుడని అంటున్నారు.
పరశురాం (parasuram) హత్య తర్వాత నిందితుడు బైరెడ్డి అనే వ్యక్తి రక్తంతో కూడిన గొడ్డలిని చూపించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. చూసిర్రా… రక్తం మరకలు అంటూ గొడ్డలి అని చూపించాడు. బైరెడ్డి అంటే ఎంటో చూపిస్తానని అందులో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బైరెడ్డి హల్‌చల్ చేసిన వీడియో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన వెనుక ఇంకా ఏదో ఉందని అంటున్నారు. హత్య చేసి, తానేంటో చూపిస్తానని నిందితుడు చెప్పడం వెనుక ఏదో ఉందని అంటున్నారు. పోలీసులు పరశురాం హత్యపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. తీగలాగితే డొంక ఎంత వరకు కదులుతుందో చూడాలి.
ALSO READ: 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య, నిందితుడ్ని ఏం చేశారంటే