BigTV English

Suriya: అసలు ఏమైంది సూర్య.? ఓటిటి లో మంచి కంటెంట్.. థియేటర్స్ లో ఏడిపిస్తున్నావ్

Suriya: అసలు ఏమైంది సూర్య.? ఓటిటి లో మంచి కంటెంట్.. థియేటర్స్ లో ఏడిపిస్తున్నావ్

Suriya: కేవలం తమిళ ప్రేక్షకులలో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో సూర్య. దీనికి కారణం సూర్య ఎంచుకునే కొన్ని సినిమాలు. సూర్య సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా చూశారు. కాకా కాకా, నువ్వు నేను ప్రేమ, గజిని, ఆరు, ఘటికుడు, వీడొక్కడే, సెవెంత్ సెన్స్ ఇలాంటి సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా గజినీ సినిమా చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి. ఆ సినిమాలు సూర్య పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను సూర్య ఎంచుకుంటాడు అని చాలామందికి ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది కూడా. అప్పట్లో సూర్య నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే చాలా క్యూరియాసిటీతో థియేటర్ కు వెళ్లే వాళ్ళు ఆడియన్స్. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సూర్య నుంచి వచ్చే సినిమాలేవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.


ఓటిటి క్వాలిటీ సినిమాలు

2020లో కరోనా విపత్తు వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోయింది. సినిమా పరిశ్రమ కూడా చాలా వరకు నష్టపోయింది. చాలామంది ప్రేక్షకులు కరోనా తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేశారు అనేది కూడా వాస్తవం. అయితే కరోనా టైంలో కూడా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలవుతూ వచ్చాయి. వాటిలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. థియేటర్లో చూడవలసిన సినిమా ఓటీటీలో చూడవలసిన పరిస్థితి వచ్చింది అని ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది బాధపడ్డారు. అలానే సూర్య నటించిన జై భీమ్ సినిమా కూడా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైంది. ఈ రెండు సినిమాలు సూర్య ఫ్యాన్స్ కి చాలా అద్భుతంగా నచ్చాయి. ఇక కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లో సినిమాలు విడుదలవడం మొదలైంది.


థియేటర్లో నిరాశ తప్పలేదు

ఓటిటి ప్లాట్ఫామ్స్ లో అంత మంచి కంటెంట్ ఇచ్చిన సూర్య థియేటర్లో ఇంకా అద్భుతమైన సినిమాలు ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు చాలామంది. అయితే సూర్య మాత్రం అంచనాలను నిలబెట్టుకోలేకపోయారు. ఇక అన్ని విషయాలు పక్కన పెడితే మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకునే సూర్య ఎందుకు ఇటువంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని ఆలోచన రాక మానదు. సూర్య నటించిన ఈటీ, కంగువ, రెట్రో ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రెట్రో సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ వస్తుంది. సూర్య ఏం చూసి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అంటూ కొంతమంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకునే సూర్య టేస్ట్ ఎక్కడికి పోయింది అనేది చాలామంది వ్యక్తిగత అభిప్రాయం.

Also Read : Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఆ డైరెక్టరకే

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×