Samantha Ruth Prabhu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని సినిమాలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అసలు కనిపించకుండా కనుమరు వెళ్లిపోయారు. ముఖ్యంగా మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని కూడా నిలబడిని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలానే మొదటి సినిమా ఊహించిన సక్సెస్ సాధించకపోయినా కూడా వరుస అవకాశాలు సాధించుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది. ఆ టైంలో వాళ్లే టాప్ హీరోహిన్ అనిపిస్తుంది. వాళ్లని కొన్ని సందర్భాల్లో గోల్డెన్ లెగ్ అని కూడా అంటారు. వరుసగా కొన్ని సినిమాలు ఫెయిలవుతున్నప్పుడు ఆ హీరోయిన్ ను ఐరన్ లెగ్ అనే సందర్భాలు చాలా ఉన్నాయి.
శృతిహాసన్ డిజాస్టర్స్
ఒక స్టార్ హీరో కూతురు ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అంటే అనేక అంచనాలు మొదలవడం అనేది సహజంగానే జరుగుతుంది. అనగనగా ఒక రాజు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీంచింది శృతిహాసన్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ సిద్ధార్థ హీరోగా ఓ మై ఫ్రెండ్ సినిమాలో కూడా కనిపించింది ఈ సినిమా అనుకున్న సక్సెస్ సాధించలేకపోయింది. సెవెంత్ సెన్స్ కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు. అప్పటికే శృతిహాసన్ కి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది శృతిహాసన్.
Also Read : STR49 : కాలేజ్ స్టూడెంట్ రోల్ శింబు, నెక్స్ట్ సినిమా బానే ప్లాన్ చేశాడు
సమంత వరుస సక్సెస్
ఇదే విషయంపై సమంత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరుసగా ఐదు ఆరు సినిమాలు హిట్స్ కొట్టాను. ఆ టైంలో అందరూ నన్ను గోల్డెన్ లెగ్, చార్మింగ్ పర్సన్, లక్కీ పర్సన్ అంటూ పొగడడం మొదలుపెట్టారు. ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత ట్రీట్ చేసే విధానం మారిపోయింది. అప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది గోల్డెన్ లెగ్ లాంటివి ఏమీ ఉండవు అని తెలిపింది. ఇక ప్రస్తుతం సమంత నిర్మాతగా శుభం అనే సినిమాను నిర్మించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ప్రొడ్యూసర్ గా కూడా సమంత సక్సెస్ అయిపోయినట్టే.
Also Read : Big TV Kissik Talks: యూట్యూబర్స్ పై శివాజీ రాజా ఊహించని కామెంట్స్.. అప్పట్లో ఏం చేసేవారో తెలుసా అంటూ..?