BigTV English

Paris Olympics: రెజ్లర్ల బరువు కొలిచే నియమాల్లో మార్పులు వస్తున్నాయ్!

Paris Olympics: రెజ్లర్ల బరువు కొలిచే నియమాల్లో మార్పులు వస్తున్నాయ్!

Changes in Rules for Weighing Wrestlers: వినేశ్ ఫొగాట్ అంశంపై ఒక్క భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వినేశ్ ఫోగట్.. ఓడిపోయి ఉండవచ్చు. తనవల్ల రెజ్లర్లకు మంచి జరిగిందని అంటున్నారు. భారత్ లో కూడా రెజ్లర్ల హక్కుల కోసం పోరాడిన వినేశ్ ఫోగట్ అంతర్జాతీయంగా కూడా తన మార్కు చూపించుకుంది. తన పోరాటం బరిలోనే కాదు, వ్యవస్థపై కూడానని నిరూపించింది.


వినేశ్ ఫోగట్ కి జరిగిన అన్యాయం నేపథ్యంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాయని అంటున్నారు. ఇక నుంచి రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మార్పులు పూర్తి స్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత, ఆరోగ్యం వీటన్నింటిని ద్రష్టిలో పెట్టుకుని స్వల్ప మార్పులు చేస్తారని అంటున్నారు. అంతేకాదు వీటిని అత్యవసరంగా అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

గేమ్ లో ఉన్నప్పుడు.. ఒక 100 గ్రాములు పెరిగితే అది తప్పెలా అవుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు. గేమ్ లోకి వచ్చినప్పుడు కరెక్టుగా ఉన్న తను బౌట్ అయిన తర్వాత 100 గ్రాములు పెరిగింది. ఈ మధ్యలో మంచినీటి కంటెంట్ పెరగడం, లేదా అజీర్తి కారణంగా శరీరంలో వ్యత్యాసాల్లో హెచ్చుతగ్గులు సహజంగా జరుగుతుంటాయని సైంటిఫిక్ రీజన్లు చెబుతున్నారు.


Also Read: సిల్వర్ మెడల్ వినేష్ ఫోగట్‌‌కు ఇవ్వడంపై యూడబ్ల్యూడబ్ల్యూ చీఫ్ క్లారిటీ

వినేశ్ ఫోగట్ ఆటలో లోపాలుంటే చెప్పాలిగానీ, 100 గ్రాములు బరువు ఎక్కువుంది. నీకు అర్హత లేదని మొత్తం గేమ్ నుంచే డిస్ క్వాలిఫై చేయడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. సెమీఫైనల్ వరకు అంతమందిని దాటుకుని వచ్చిన వినేశ్ ఫొగట్ కి రాని బరువు తేడా..ఇప్పుడు వస్తే, మొత్తం ఆట నుంచే డిస్ క్వాలిఫై చేయడం నేరమని అంటున్నారు.

ఇకపోతే అంతర్జాతీయంగా కూడా వినేశ్ ఫోగట్ విషయంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 13 సాయంత్రం 6 గంటలకు తీర్పు రానుంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×