Singer Sunitha: సంగీతానికి ఉన్న శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అని అంటుంటారు. సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో చెప్పలేము కానీ ఖచ్చితంగా కొన్ని మనసులు మాత్రం కరుగుతాయి. ఒక మంచి పాట సరికొత్త ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది. ఒక మంచి పాట ప్రశాంతతనిస్తుంది. ఒక మంచి పాట మనల్ని కదిలిస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫిమేల్ సింగర్స్ లో ది బెస్ట్ సింగర్ అంటే డౌటు లేకుండా గుర్తొచ్చే పేరు సునీత. ఈ వేళలో నీవు అంటూ ఏ ముహూర్తాన సునీత పాడటం మొదలుపెట్టిందో, ఇప్పటికీ ఆమె పాటల ప్రయాణం విజయవంతంగా సాగుతూనే ఉంది. సునీత 17 సంవత్సరాల వయసులో కృష్ణవంశీ దర్శకత్వంలో శశి ప్రీతం సంగీతం అందించిన గులాబీ సినిమాతో సునీత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రతి వేదిక పైన ఆమె ఈ పాటని పాడుతూ ఉంటారు.
సంగీతంపై ఆసక్తి
గుంటూరులో పుట్టి పెరిగిన సునీత విజయవాడలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తితో “పెమ్మరాజు సూర్యారావు” అనే గురువు దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. “కలగా కృష్ణమోహన్” అనే గురువు దగ్గర లలిత సంగీతం ఎనిమిది సంవత్సరాలు పాటు నేర్చుకున్నారు. అలానే గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొనేవారు సునీత. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలోని పాటతోనే సునీత ఫేమస్ అయిపోయారు. తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో దాదాపుగా 3000కు పైగా పాటలను పాడారు. కేవలం పాటలను పాడడం మాత్రమే కాకుండా 750 సినిమాలు కు పైగా డబ్బింగ్ చెప్పారు. చూడాలని ఉంది, నేనున్నాను, ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలు సునీతకు విపరీతంగా పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు చాలామంది ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు. వాటిలో చాలా మటుకు సునీత డబ్బింగ్ చెప్పిన సినిమా డైలాగులు ఉంటాయి.
వ్యక్తిగత జీవితం
ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లు సునీత జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన టైంలో సునీత 19 ఏళ్లకు కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఆకాష్, శ్రేయ అని పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత అయిన రామ్ వీరపనేనితో 2021 జనవరి 9న ఈవిడకి రెండో పెళ్లి జరిగింది. ఇక ప్రస్తుతం సునీత పాటలు పాడటమే కాకుండా కొన్ని రియాలిటీ షోస్ కి న్యాయ నిర్ణీతగా కూడా వ్యవహరిస్తుంది.
సునీత ఇష్యూ
ఎన్నో రియాలిటీ షోస్ కి పనిచేసిన సునీతకి రీసెంట్ గానే పాడుతా తీయగా అనే షోలో ఒక కంటెస్టెంట్ చేసిన ఆరోపణలు, కొద్దిపాటి వ్యతిరేకతను తీసుకొచ్చాయి. సునీత అంటే ఎంతమందికి వ్యతిరేకత ఉందో తెలియదు గానీ. ప్రవస్తి అనే సింగర్ సునీత పై చేసిన కొన్ని కామెంట్స్ తర్వాత చాలామంది సునీతను తిట్టడం మొదలుపెట్టారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు అంటూ ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. అయితే వీటన్నిటికీ కూడా సునీత తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇకపోతే సునీత సింగింగ్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గోదావరి సినిమాకి పాడిన అందంగా లేనా అనే పాట ఇప్పటికీ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది.
Also Read : Nani : వాట్సప్ గ్రూప్‌లో రామ్ చరణ్, బన్నీ, రానా… కానీ, ఇప్పుడు అది ఎందుకు పనికి రాదు