Dacoit: అడివి శేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన శేష్.. పంజా సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తరువాత బాహుబలి సినిమాలో రానా కొడుకుగా నటించి స్టార్ గా మారాడు. ఇక తనలో ఉన్న రచయితను బయటపెట్టి .. తన కథను తానే రాసుకొని క్షణం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఇక ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికి తెల్సిందే. అప్పటి నుంచి శేష్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో కుర్ర హీరోల్లో కలిసిపోయాడు. ప్రస్తుతం శేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం గూఢచారి 2. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు శేష్ చెప్పుకొచ్చాడు.
Bigg Boss Kannada : షోను వదిలిపెట్టడానికి కారణం ఇదేనంటూ బాంబ్ పేల్చిన సుదీప్
ఇక ఈ సినిమా కాకుండా శేష్ నటిస్తున్న మరో చిత్రం డెకాయిట్. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మొదటి ఈ చిత్రంలో శేష్ సరసన శృతి హాసన్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. వీరిద్దరికి సంబంధించిన ఒక గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా 70 శాతం పూర్తి అయింది. అందులో చాలావరకు శృతి హాసన్ సీన్స్ కూడా ఉన్నాయి.
మధ్యలో ఏమైందో ఏమో కానీ, శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆ విషయాన్నీఆమె అధికారికంగా ప్రకటించింది. దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావాలని, ఇప్పటికే ఇండస్ట్రీలో పాపులర్ ఉన్న మరో కథానాయికను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనీ దీనిపై వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. ఇక ఎట్టకేలకు అడివి శేష్ కొత్త హీరోయిన్ ను రంగంలోకి దింపాడు. ఒక పోస్టర్ తో కొత్త హీరోయిన్ ను పరిచయం చేశాడు. అయితే ఆమె ఎవరు అన్నది మాత్రం రేపు చెప్తాను అని చెప్పుకొచ్చాడు.
OTT Movie Releases: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. 30 సినిమాలు రిలీజ్ .. ఆ ఒక్కటి స్పెషల్..
“తనని కాపాడినా … కానీ ఒదిలేసినాది… తను ఏంటో… అసలెవరో రేపు తెలిసొస్తాది” అంటూ చెప్పుకొచ్చాడు. శేష్ చేతులతో ఆమె ముఖాన్ని సగం వరకు కప్పేయడంతో ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు ఆమె ఎవరో అనేది రేపు తెలుసుకోవాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆమె ఎవరో మాకు తెలిసిపోయింది మృణాల్ ఠాకుర్.. మా సీతను మేము గుర్తుపట్టలేమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
శృతి హాసన్ ప్లేస్ ను మృణాల్ రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. శృతితో చేసిన సీన్స్ అన్ని మళ్లీ మృణాల్ తో రీ షూట్ చేయాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మృణాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Thanani kaapadina…
Kaani odhilesinaadhi…
Thanu ento…asalevaro…
Repu thelsosthaadhi – 11:30 AMతనని కాపాడినా …
కానీ ఒదిలేసినాది…
తను ఏంటో… అసలెవరో
రేపు తెలిసొస్తాది …#DACOIT pic.twitter.com/jvlqVuqdWz— Adivi Sesh (@AdiviSesh) December 16, 2024