Chiranjeevi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎవరి సహాయం లేకుండా వచ్చి వరుస విజయాలతో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతోనే కాదు కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా ముందుంటారు చిరంజీవి. అలాంటి ఈయన ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి విచ్చేశారు. ఇందులో రాజకీయాల గురించి స్పందించడంతో కాస్త వివాదాస్పదంగా మారింది.
చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ డిమాండ్..
ఈ సంఘటన మరువక ముందే మళ్లీ బ్రహ్మానందం(Brahmanandam) నటించిన ‘బ్రహ్మ ఆనందం’ ఈవెంట్లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి కామెంట్స్ పై అటు నెటిజన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా అనడం కరెక్ట్ కాదు. చిరంజీవినే ఇలా ఆలోచిస్తే, ఇక సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారో? లింగ వివక్షత ఇంకా ఎప్పుడు పోతుందో ? అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ మహిళా కమిషన్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బ్రహ్మనందం తన కొడుకు గౌతమ్ (Gautam RAJA ) తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కార్యక్రమాన్ని హోస్ట్ గా వ్యవహరించిన సుమా కనకాల (Suma Kanakala) మాట్లాడుతూ క్లీంకారా వాళ్ళ తాత గారిని చూద్దాం అంటూ ఒక ఫోటో చూపించింది. ఫస్ట్ ఇది చూసిన చిరంజీవి అమాయకంగా ఫేస్ పెట్టి, ఆ తర్వాత..” నేను నా ఇంట్లో ఉన్నప్పుడు నా మనవరాళ్లను చూస్తే వాళ్లతో వున్నట్టు అనిపించదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా అనిపిస్తుంది. చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగాడు కూడా లేడు. రేయ్ చరణ్ ఈసారైనా ఒక అబ్బాయిని కనరా అని అడిగాను.మన లెగసీ కంటిన్యూ అవ్వాలని చెప్పాను అదే నా కోరిక. ముందు ఇప్పుడు అమ్మాయిలు అంటే భయం వేస్తుంది. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో అని. చివర్లో లవ్లీ కిడ్స్ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు చిరంజీవి. చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొంతమంది లింగ వివక్షత చూపిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే చిరంజీవి సరదాగా అన్నా మహిళా కమిషన్ సంఘాలు మాత్రం దీనిపై సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
చిరంజీవి సినిమాలు..
మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట మల్లిడి (Vashishtha mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ నిర్మాత సాహు గారపాటి (Sahoo garapati) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మారుతి (Maruthi) డైరెక్షన్లో ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.