Jee Mains result 2025: నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటి పోతుంది. దీనివల్ల లేని పోని అపోహాలు తలెత్తుతాయి. మంగళవారం జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా 14 మందికి 100 శాతం వచ్చింది. అందులో 11 మంది ఉత్తరాది విద్యార్థులు ఉన్నారు. కేవలం ముగ్గురు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంపై అనేక సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్య సంస్థలు ఐఐటీలు. 2025-26 ఏడాదిలో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షలు జనవరి మూడో వారం నుంచి ఐదురోజులపాటు జరిగాయి. తొలి విడత పరీక్షలకు 13 మంది లక్షల మంది దరఖాస్తు పెట్టుకోగా, 12 న్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు.
వీటీకి సంబంధించిన ఫలితాలు మంగళవారం వచ్చాయి. తొలి విడత జరిగిన పేపర్-1 పరీక్షలో 100కు 100 శాతం మార్కులు మొత్తం 14 మందికి వచ్చాయి. వారిలో ఏకంగా 11 మంది కేవలం ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. అందులో ఐదుగురు ఒక్క రాజస్థాన్ నుంచి ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నవాళ్లు లేకపోలేదు.
గతంలో వందకు 100 శాతం వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని అంటున్నారు.ఈసారి తగ్గిపోవడం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తొలి విడత మెయిన్స్ లో 20 మందికి గాను 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రావడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఆ సంఖ్య రెండుకి పడిపోయింది. అదెలా సాధ్యమన్నది కొన్ని కోచింగ్ సెంటర్ల మాట. ట్రెండ్‌కు తగ్గట్టుగా సిలబస్ మార్చుకుంటూ వెళ్తున్నామని అంటున్నారు.
ALSO READ: ఈవీఎంలలో ఎన్నికల డేటా తొలగించవద్దు.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఎందుకంటే
ఈ ఫలితాలు తమను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని కొందరంటున్నారు. చాలామంది స్టూడెంట్స్ మాత్రం తాము బాగానే రాశామని అంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులపై కోచింగ్ సెంటర్లు, పేరెంట్స్ నుంచి ఒత్తిడి పెరిగే అవకాశముందని అంటున్నారు. ఏ ప్రాతిపదిక ఫలితాలు ఇలా వచ్చాయో తెలీదని అంటున్నారు. ఇప్పుడు రాకపోయినా నిరాశ పడాల్సిన పని లేదని, మరో ఛాన్స్ ఉందని ధీమాగా చెబుతున్నారు.
జరుగుతున్న ర్యాంకుల పరిణామాలను కోచింగ్ సెంటర్లు, పేరెంట్స్ నిశితంగా గమనిస్తున్నారు. గతంలో నీట్-2024లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నవాళ్లూ లేకపోలేదు. అయితే ఏప్రిల్ 1-8 మధ్య జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు జరగనున్నాయి. అందులో వచ్చిన ఫలితాలు ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు.
తొలి విడత రాసిన విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసి ఎగ్జామ్ హాజరు కావచ్చు. రెండింటిలో ఉత్తమ స్కోర్ వచ్చిన దానికి ర్యాంకును కేటాయిస్తారు. దాని ప్రకారం రెండున్నర లక్షల మందిని మాత్రమే అర్హత సాధిస్తారు. వారు మాత్రమే మే థర్డ వీక్ లో జరగనున్న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అర్హులవుతారన్నమాట. గతేడాదిలో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికీ పేరెంట్స్ కళ్ల ముందు వెంటాడుతూనే ఉంది.
🚨 JEE Mains 2025 results are out.
14 candidates achieved a perfect 100 percentile.
1. Ayush Singhal (Rajasthan)
2. Kushagra Gupta (Karnataka)
3. Daksh (Delhi)
4. Harsh Jha (Delhi)
5. Rajit Gupta (Rajasthan)
6. Shreyas Lohiya (Uttar Pradesh)
7. Saksham Jindal (Rajasthan)
8.…— Indian Tech & Infra (@IndianTechGuide) February 11, 2025