BigTV English

UK Targets Indian Restaurants : ట్రంప్‌ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!

UK Targets Indian Restaurants : ట్రంప్‌ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!

UK Targets Indian Restaurants | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తీరుని చూసి.. ఇదే మార్గంలో బ్రిటన్ కూడా అడుగులు వేస్తోంది. విదేశీ నేరగాళ్ళను, ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించి పనులు చేస్తున్న వారిని లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రక్రియలో, ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తున్నారు.


తాజాగా, యూకే వైడ్ బ్లిట్జ్ (UK-wide blitz) పేరుతో వలసదారులు పనిచేస్తున్న భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలతోపాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై కూడా తనిఖీలు జరిపి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని యూకే హోం మంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ తెలిపారు.

హంబర్సైడ్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్లో జరిపిన తనిఖీల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అలాగే, సౌత్ లండన్లోని ఒక భారతీయ గ్రాసరీ వేర్హౌస్లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.


అదుపులోకి తీసుకున్న వారిని డొనాల్డ్ ట్రంప్ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపిస్తున్నారు. వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు ఇటీవల విడుదల చేశారు. అయితే వారిలో నేరగాళ్ళు ఉండడం వల్లే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు.

Also Read: పాక్ చైనా సంయుక్త నౌకాదళ విన్యాసాలు.. హిందూ మహాసముద్రంలో భారత్‌కు డేంజర్?

చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు (Migrants) అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే, జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు జరిపి, 609 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కూడా ఈ విషయంపై సోమవారం స్పందించారు. “బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్టవిరుద్ధ వలసలను ముగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింపు, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా, వలసలు వచ్చే ప్రక్రియలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని బ్రిటన్ ప్రజాప్రతినిధులు అందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది జులైలో బ్రిటన్ దేశంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 4,000 మంది అక్రమ కార్మికులను అరెస్టు చేసినట్లు యూకే హోం శాఖ గణాంకాలు తెలిపాయి. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Related News

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Big Stories

×