YouTuber Aditya: ఈరోజుల్లో సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు విచక్షణ లేని పనులు చేస్తున్నారు. అలా క్రియేట్ చేసిన కంటెంట్ వైరల్ అవ్వడం, లక్షల్లో వ్యూస్ రావడం వల్ల వారు చేస్తుంది కరెక్టా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎవరో ఒకరు ముందుకొచ్చి వారు చేస్తున్న దాన్ని విమర్శించి, దానికి ఎదురు మాట్లాడితే తప్పా వారు చేస్తుంది తప్పు అని గ్రహించలేకపోతున్నారు. అలా తాజాగా ఒక యూట్యూబర్ చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. దీంతో తన తప్పు తెలుసుకొని మరొకసారి అలాంటి పని చేయను అంటూ సోషల్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.?
గోల్డ్ హంట్
అమలాపురంలో లోకల్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబర్‌గా సెటిల్ అయ్యాడు మండపాటి ఆదిత్య (Mandapati Aditya). తాజాగా తన యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ రావడం కోసం గోల్డ్ హంట్ అనేది మొదలుపెట్టాడు. ఈ గోల్డ్ హంట్‌లో భాగంగా అమలాపురంలోని బాలయోగి స్టేడియం మొత్తం తవ్వించాడు యూట్యూబర్ ఆదిత్య (YouTuber Aditya). ఒక స్టేడియంను అలా తవ్వించడం వల్ల అక్కడ జరిగే కార్యక్రమాలకు, దానిని ఉపయోగించుకుంటున్న క్రీడాకారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తను గ్రహించలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆదిత్యపై నెటిజన్లు మాత్రమే కాదు.. అధికారులు కూడా తిరగబడ్డారు. అలా ఆదిత్య తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్తూ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అత్యాశతో తవ్వకాలు
అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో తాను బంగారం, వెండి ఆభరణాలను దాచానంటూ ఒక వీడియో చేసి దానిని పోస్ట్ చేశాడు ఆదిత్య. అంతే కాకుండా ఆ వీడియోకు మరిన్ని వ్యూస్ రావాలని అక్కడి స్థానికులను స్టేడియంకు కూడా రప్పించాడు. అలా ఆదిత్య పిలుపుతో స్థానికులు మాత్రమే కాదు తన పలువురు ఫాలోవర్స్ కూడా ఆ స్టేడియం వద్దకు చేరుకున్నారు. నిజంగానే బంగారం దొరుకుందేమో అన్న అత్యాశతో స్టేడియం మొత్తం తవ్వేశారు. ఆ తవ్వకాలను చూసి అక్కడి అధికారులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మెల్లగా ఈ వివాదం ముదిరింది. ఎక్కడ దీని వల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతాయో అని భయపడిన ఆదిత్య.. క్షమాపణలు చెప్పి దీనికి ముగింపు పలికాడు.
Also Read: నాని అనే మంచోడు ఒక్కడే ఉండేవాడు.. వాన్ని కూడా నాశనం చేశారు కదరా..
అభిమానులకు క్షమాపణలు
‘‘మొన్న శుక్రవారం బాలయోగి స్టేడియంకు వచ్చి హంట్ అని చెప్పి అందరినీ ఇబ్బందిపెట్టాను. బాలయోగి అభిమానులకు నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇలాంటి పొరపాట్లు ఇంకెక్కడా చేయను. హంట్ వీడియోలు కూడా ఇకపై మానేస్తాను. నన్ను క్షమించండి. నా ఫాలోవర్స్ వల్ల గ్రౌండ్ పాడయ్యింది కాబట్టి నేనే దగ్గరుండి పూడుస్తాను’’ అంటూ పాడయిన గ్రౌండ్ మొత్తం పూడ్చానంటూ వీడియోలో చూపించాడు ఆదిత్య. మొత్తానికి ఇలా ఇష్టం వచ్చినట్టు కంటెంట్‌తో వీడియోలు చేయడం వల్ల ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని, ఇది చూసి యూట్యూబర్లు బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">