Anvesh Reaction: ప్రశ్నించడం తప్పులేదు.. ఆధారాలు ఉంటే ఎవరినైనా ప్రశ్నించొచ్చు. ఆరోపణల్లా కాకుండా ఆధారాలు చూపించ వచ్చు. అయితే యూట్యూబర్ అన్వేష్ నిరాధారంగా పోలీస్ ఉన్నతాధికారులపై.. నిందలు వేస్తున్నారంటూ కేసు నమోదు అయింది. ఆ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై.. ఇటీవల వరుస వీడియోలు చేస్తున్నాడు అన్వేష్. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులను, మరికొందరు అధికారులను టార్గెట్ చేస్తూ ఇటీవల ఓ వీడియో తీయడం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ యాడ్స్‌కు 300 కోట్లు లంచం తీసుకున్నారని డీజీపీ జితేందర్, మాజీ సీఎస్ శాంతకుమారిపై అన్వేష్ ఆరోపించారు. అన్వేష్ ఆరోపణలను ఖండిస్తూ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్‌పై పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారుల విశ్వసనీయతకు దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా వీడియో ఉందని.. తన ఫిర్యాదులో వివరించారు కానిస్టేబుల్. దీనిపై పోలీసుల తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
“అయితే కేసు ఫైల్ చేయడాన్ని అన్వేష్ తప్పు పట్టారు. బెట్టింగ్‌కు వ్యతిరేకంగా తాను 2 నెలలుగా పోరాటం చేస్తున్నానని ఆయన అన్నాడు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబాలకు తాను ఆర్థిక సాయం కూడా చేస్తున్నానని అన్నాడు అన్వేష్. 2 లక్షల రూపాయల చొప్పున 5 కుటుంబాలకు సాయం చేశానని అన్నాడు.
అలాంటి తనపై కేసు నమోదు చేయడం ఏంటని అన్వేష్ ప్రశ్న. ఎన్నో ఏళ్లుగా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే.. పాపులారిటీ కోసమే అన్వేష్ ఇదంతా చేస్తున్నారని మరికొంతమంది యూట్యూబర్లు ఆరోపిస్తున్నాడు.”
కాగా నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న.. ఇన్ ఫ్లూయెన్సర్స్ యూట్యూబర్‌లను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తోటి యూట్యూబర్స్‌తో మాటల యుద్దం కూడా పర్శనల్ స్థాయికి వెళ్లింది. మొత్తానికి ఈ వ్యవహారంలో యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు కూడా. అయితే ఇప్పుడు అన్వేష్ ఏకంగా తెలంగాణ డీజీపీతో పాటు మరికొందరిపైనా తీవ్రమైన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: సమంత ఈ సినిమాకి బిగ్ సపోర్ట్, నాకు వాళ్ళు దైవంతో సమానం.
పోలీసు ఉన్నతాధికారులపై నిరాధార ఆరోపణలు చేశారంటూ.. అన్వేష్‌పై కేసు నమోదు అవడంతో ఇప్పుడు అతని తీరుపై.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అంటున్న అన్వేష్.. తాను చేస్తున్న చాలా వీడియోల్లో వ్యభిచారంపై మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సుమారు 24 లక్షల మంది సబ్‌స్క్రైబ్స్ ఉన్నారు. అలాంటి ఇన్ ఫ్లూయెన్సర్ బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి.. బూతు కంటెంట్‌ను తరుచూ ప్రమోట్ చేయడమేంటనే విమర్శలు కూడా వస్తున్నాయి.