Indian Railway: భారతీయ రైల్వే రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, సరికొత్త రైళ్లను అదుబాటులోకి తీసుకొస్తోంది. అదే సమయంలో రైళ్ల వేగం మరింత పెరిగేలా తగిన మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే తాజాగా కేవలం 4.5 గంటల్లో సబ్ వేను నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించింది.
పెందుర్తి- కొత్తవలస మధ్య సబ్ వే నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ లోని పెందుర్తి- కొత్తవలస మధ్య ఈ సబ్ వేను నిర్మించింది. దేశంలోని అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన బ్రిడ్జిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు కొనసాగాయి. “రైళ్ల వేగాన్ని పెంచేందుకు, ప్యాసింజర్లు అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు తగిన మౌలికి సదుపాయాలను పెంచుతున్నాం. అందులో భాగంగానే పెందుర్తి- కొత్తవలస మధ్యలో కొద్ది గంటల్లోనే సబ్ వే నిర్మించాం. పరిమిత ఎత్తులో నిర్మించిన ఈ సబ్ వేలో 1.5 మీటర్ల వెడల్పు గల 20 భాగాలు ఉన్నాయి. బాక్స్ పరిమాణం 4.65 మీ X 3.65 మీ. ఈ 20 విభాగాలను కలిపి కేవలం నాలుగున్నర గంటల్లోనే సబ్ వే అందుబాటులోకి తీసుకొచ్చాం” అని విశాఖపట్నంలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECR) అధికారులు వెల్లడించారు.
సబ్ వే నిర్మాణంలో పాల్గొన్న 300 మంది సిబ్బంది
ఇక ఈ సబ్ వే నిర్మాణంలో 16 హెవీ డ్యూటీ ఎక్స్ కవేటర్లు, 3 క్రేన్లు, 5 టిప్పర్లు, 4 హైడ్రా మెషీన్లు, హెవీవెయిట్ జాక్ లు, 1,000 ఇసుక బస్తాలను ఉపయోగించారు. 300 మంది రైల్వే సిబ్బంది ఈ సబ్ వే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. ముందుగా బ్లాక్ ప్రారంభమైన తర్వాత, ట్రాక్ లు తొలగించారు. సబ్ వే రెండు చివర్ల నుంచి మట్టి పని మొదలు పెట్టారు. క్రేన్ ల సహాయంతో ముందుగా తయారు చేసిన కాంక్రీట్ బాక్స్ లను బేస్ స్లాబ్ లను క్రమ పద్దతిలో అమర్చారు. ఎర్త్ వర్క్ తో పాటు భూమిని చదును చేయానికి 1 గంట సమయం పట్టింది. బాక్స్ ప్లేస్ మెంట్, ట్రాక్ లింకింగ్ కు 1.5 గంటలు పట్టింది. మొత్తం నిర్మాణ బ్లాక్ ను కేవలం 4.5 గంటల్లో నిర్మించారు రైల్వే అధికారులు.
Read Also: చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, IRCTC అదిరిపోయే టూర్ ప్లాన్ రెడీ!
సుమారు 6 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేత
అటు రైల్వే సబ్ వే నిర్మాణం కారణంగా రైల్వే అధికారులు సుమారు 6 గంటల పాటు పెందుర్తి- కొత్తవలస మధ్య మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఈ సబ్ వే నిర్మాణం కారణంగా మనుషులతో కూడిన లెవల్ క్రాసింగ్ క్లోజ్ అయ్యింది. ఫలితంగా భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైళ్ల రాకపోకలతో పాటు వాహనాలు వెళ్లనున్నాయి. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ సబ్ వేను నిర్మించారు రైల్వే అధికారులు.
Read Also: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. ఇండియాలోనే నెంబర్ 1గా ఎలా ఎదిగింది?