BigTV English
Advertisement

Prabhas:  మళ్లీ జన్మ ఉంటే ప్రభాస్ కొడుకుగా పుట్టాలి..  జరీనా వహాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Prabhas:  మళ్లీ జన్మ ఉంటే ప్రభాస్ కొడుకుగా పుట్టాలి..  జరీనా వహాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Prabhas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్(Prabhas) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఏమాత్రం గర్వం లేకుండా ఒక సాదా సీదా వ్యక్తిలా కనిపిస్తూ ఉంటారు. ఇక తన చుట్టూ ఉన్న వారందరితోను ఎంతో మంచిగా ఉంటూ వారి క్షేమాలను వారి ఆకలని కూడా తెలుసుకొని వారికి నచ్చిన ఆహారాన్ని పెడుతూ కడుపు నింపుతారు. ఇలా ఎంతో మంచి మనసున్న ప్రభాస్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు చాలా గొప్పగా వర్ణించారు. అయితే తాజాగా మరో నటి ఏకంగా తనకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


ప్రభాస్ లాంటి వ్యక్తి ఉండరు…

ప్రభాస్ త్వరలోనే ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటి జరీనా వహాబ్(Zarina wahab) నటిస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. “ప్రభాస్ లాంటి వ్యక్తి ఈ భూమిపై మరొకరు ఎవరు ఉండరని ఆమె తెలిపారు. చాలా మంచి వ్యక్తి . నాకు మరో జన్మంటూ ఉంటే కచ్చితంగా ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటానని తెలిపారు. ప్రభాస్ లవ్లీ పర్సన్ తను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి” అంటూ నటి జరీనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


ప్రభాస్ ఆతిథ్యం…

ఇలా ప్రభాస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమి కాదు గతంలో ఎంతో మంది నటీమణులు కూడా ప్రభాస్ గురించి ఇలా గొప్పగా చెబూతు ప్రభాస్ లాంటి కొడుకు కావాలని తెలియజేశారు. ప్రభాస్ పెద్దగా ఏ విషయాలలోనూ ఇన్వాల్వ్ కాకపోయినా ఆయన సినిమా షూటింగ్ సమయంలో మాత్రం తన చుట్టూ ఉన్న వారిని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ దగ్గర తీసుకుంటారు. అంతేకాకుండా షూటింగ్ లొకేషన్లో ఉన్నవారికి ఇష్టమైన భోజనాన్ని పెడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు. ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాటలలో వర్ణించడం అసాధ్యం.

ఇలా ప్రభాస్ ఫుడ్ పెట్టి మరి చంపుతారు అంటూ ఎంతోమంది ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి తెలిపారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. ఏడాది చివరి రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజి వంటి సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవటమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి.

Also Read: Solo Boy Trailer : మిడిల్ క్లాస్ లో పుట్టడమే తప్పా.. సోలోగా హిట్ కొట్టేలా ఉన్నాడే!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×