ఆపరేషన్ సిందూర్ జరిగిన రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ లో పాక్ ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం 9 ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే భారత్ దాడి చేసింది. అయితే ఈసారి మాత్రం నేరుగా పాక్ ఆర్మీకే చావుదెబ్బ తగిలింది. రెండు వేర్వేరు ఘటనల్లో 14మంది పాక్ సైనికులు చనిపోయారు. పాక్ సైనికులు వెళ్తున్న వ్యాన్ ని బాంబులు వేసి పీస్ పీస్ చేశారు. ఈ పనిచేసింది మరెవరో కాదు, పాక్ పక్కలో బల్లెంలా మారిన బలూచిస్తాన్ వేర్పాటువాదులు.
పాక్ ఆర్మీపై BLA అటాక్..
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మరోసారి రక్తం ఏరులై పారింది. పాక్ సైనికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పీస్ పీస్ అయిపోయాయి. బలూచిస్తాన్ వేర్పాటు వాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) జరిపిన దాడిలో మొత్తం 14మంది పాక్ సైనికులు మృతిచెందారు. దీంతో మరోసారి బలూచిస్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ జరిగిన మరుసటి రోజే బలూచిస్తాన్ దాడి పాక్ ని కలవరపెడుతోంది.
🚨 BREAKING NEWS
The Baloch Liberation Army (BLA) has ELIMINATED 14 Pakistani soldiers, including senior officers, in two deadly IED attacks carried out in Balochistan’s Bolan and Kech regions. pic.twitter.com/BdeX6tP2WI
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 8, 2025
అసలేంటి వివాదం..?
కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం బలూచిస్తాన్. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉంది. మరికొంత భాగం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అధీనంలో ఉంది. అయితే బలూచ్ ప్రజలు పాక్ ఆధిపత్యాన్ని సహిచండం లేదు. తమకు స్వాతంత్రం కావాలని వారు కోరుకుంటున్నారు. గ్రేటర్ బలూచిస్తాన్ కోసం వారు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హింసాయుత మార్గం ఎంచుకుంది. స్వాతంత్రం కోసం వారు తుపాకి పట్టారు. పాక్ ఆర్మీని చావుదెబ్బ తీస్తున్నారు. గతంలో పలుమార్లు పాక్ ఆర్మీ సిబ్బందిని BLA మట్టుబెట్టింది. కానీ పాకిస్తాన్ కి మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. కారణం అక్కడ ఉన్న సహజ సంపద. బలూచిస్తాన్ సహజ వనరులు పాకిస్తాన్ ఆర్థిక పరిపుష్టికి కారణం కావడం వల్లే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోనే ఉంచుకుంది పాకిస్తాన్.
తాజాగా జరిగిన దాడిలో BLA మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి సరైన హెచ్చరిక పంపినట్లయింది. బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకుని BLA ఐఈడీని పేల్చింది. ఈ పేలుడుతో కాన్వాయ్ లో వెళ్తున్న వ్యాన్ పేలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12మంది సైనికులు నామరూపాల్లేకుండా తునాతునకలయ్యారు. వ్యాన్ దగ్ధమైంది. సైనికుల శరీర భాగాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పడిపోయాయి. ఈ దాడి BLA కి ఒక పెద్ద విజయంగా భావించవచ్చు.
ఇక అదే రోజు కేచ్ జిల్లాలోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ సైన్యానికి షాకిచ్చింది BLA. ఏకంగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌పై నే BLA ఫైటర్లు దాడి చేశారు. మధ్యాహ్నం సమయంలో క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు స్పాట్ లోనే చనిపోయారు. ఒకేరోజు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 14మంది చనిపోవడం సంచలనంగా మారింది. ఈ ఈ రెండు దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు BLA ప్రతినిధి జీయంద్ బలూచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ కిరాయి సైన్యాన్ని మట్టుబెడతామని హెచ్చరించారు. చైనా పెట్టుబడులు, ఇతరుల ప్రయోజనాల కోసం పాక్ ఆర్మీ పనిచేస్తోందని ఆరోపించారు. తమ భూమిని ఆక్రమించుకున్న కిరాయి సైన్యంపై బలూచ్ స్వాతంత్ర సమరయోధుల దాడులు రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.