BigTV English

Indian Americans: అమెరికా ఆదాయంలో 6% వాటా భారతీయ సంతతిదేనట !

Indian Americans: అమెరికా ఆదాయంలో 6% వాటా భారతీయ సంతతిదేనట !

Indian Americans : భారతీయ సంతతితోనే అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. అమెరికా జనాభాలో భారత సంతతివారు 1.5 శాతం మాత్రమే ఉన్నా.. వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉందని పేర్కొంది.


అమెరికా జనాభాలో 1.5% భారత సంతతి వారు ఉన్నారు. అమెరికాలో ఉన్న భారత సంతతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం పేర్కొంది. భారతీయ సంతతి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందని వెల్లడించింది. మొత్తం ఆదాయ పన్నులో భారతీయ అమెరికన్ల నుంచి సుమారు 5% నుంచి 6% వస్తుందని నివేదిక తెలిపింది.

16 కంపెనీలకు భారత సంతతి వారే సీఈఓలు:
2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా సుమారు 55 లక్షలకు చేరుకుంది. అంటే అమెరికా జనాభాలో 1.5% భారతీయులు ఉన్నారు. వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ పన్నులో 5% నుంచి 6% లభిస్తోంది. దాదాపు ఇది 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల డాలర్లకు ఇది సమానం. భారతీయ అమెరికన్ల వృత్తుల వల్ల అమెరికాలో కోటి 20 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి.


ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 16 సంస్థలకు భారతీయ అమెరికన్లు ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా పని చేస్తున్నారు. వారిలో సుందర్ పిచాయ్(గూగుల్) సత్యా నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)తో పాటు చాలా మంది ఉన్నారు. ఈ కంపెనీల వల్ల 27 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. భారత సంతతి వల్ల దేశానికి లక్ష కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.

Also Read: అమెరికాలో దారుణం, ఇండియన్ జ్యువెలరీ షాపు లూటీ

55,000 మందికి ఉపాధి:
అమెరికాలోని 648 యూనికార్న్‌లలో 72 సంస్థల సహ వ్యవస్థాపకులు భారతీయులే ఉన్నారు. యూనికార్న్‌ల వల్ల 55 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అమెరికాలో 60% హోటళ్లు భారతీయ అమెరికన్లు నడుపుతున్నారు. అంతే కాకుండా అమెరికాలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో 22 వేల మంది భారతీయ అధ్యాపకులు పనిచేస్తున్నారు.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×