BigTV English

Congo: కాంగోలో ఘోర ప్రమాదం..50 మందికి పైగా మృతి, గల్లంతైన వారి కోసం గాలింపు

Congo: కాంగోలో ఘోర ప్రమాదం..50 మందికి పైగా మృతి, గల్లంతైన వారి కోసం గాలింపు

Congo: కాంగోలో ఘోరం ప్రమాదం జరిగింది. దాదాపు 400 మందితో వెళ్తున్న ఓ పడవలో సడన్‌గా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బోల్తా పడింది. దాదాపు 50 మందికి పైగా మరణించారు. వందలాది మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన వెనుక అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


అసలేం జరిగింది?

మంగళవారం రాత్రి దాదాపు 400 మంది ప్రయాణికులతో కూడిన పడవ బయలు దేరింది. హెచ్‌బి కొంగోలో అనే ఈ బోటు.. మటాంకుము ఓడరేవు నుండి బోలోంబా ప్రాంతానికి జర్నీ మొదలైంది.  అయితే బోటు మ్బండకా పట్టణ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు మహిళలు, పిల్లలు సహా అందరూ నదిలోకి దూకేశారు.


ఈత వచ్చినవారు మెల్లగా ఒడ్డుకు చేరుకున్నారు. రానివారి నది మునిగిపోయారు ప్రాణాలు కోల్పోయారు.  అందులో చిన్నారులు, మహిళలు సైతం ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆయా టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చాయి.

అంతర్యుద్ధం కారణమా?

మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో పడవ ప్రమాదాలు అక్కడ సర్వ సాధారణం. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లేందుకు పడవలపై రాత్రి వేళ ప్రయాణాలు చేస్తుంటారు. కాంగో ప్రభుత్వం -తిరుగుబాటుదారులకు మూడేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. యుద్ధం కారణంగా రోడ్డు మార్గాలను ప్రభుత్వం మూసి వేసింది. దీంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే పడవలను ఆశ్రయిస్తారు అక్కడి ప్రజలు.

ALSO READ: అమెరికాలో భారతీయుల సంఖ్య తగ్గించడమే టార్గెట్.. వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు కొనసాగుతాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా ఇలాంటి పెను ప్రమాదాలు జరిగాయి. పడవ ఘటనలో మినిమం 50 మందికి పైగా మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఆయా బోట్లను ఆపేందుకు కోస్టల్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దేశాన్ని వదలి వెళ్లేవారు రాత్రి వేళ ప్రయాణాలు చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆ తరహా ఘటన మూడోదని స్థానికులు చెబుతున్నారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×