E-Paper
Advertisement

టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా.. కుప్పకూలిన షేర్లు.. గుడ్ బైకి కారణం అదేనా?

టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా.. కుప్పకూలిన షేర్లు.. గుడ్ బైకి కారణం అదేనా?
Advertisement

Tata Sons Chairman: టాటా గ్రూప్ లో ఆదిపత్య పోరు మళ్లీ మెుదలైనట్లు తెలుస్తోంది. దీంతో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 18న కంపెనీ వార్షిక సర్వ సభ్యసమావేశం జరగనుండగా.. దానికి ముందే ఛైర్మన్ పదవి నుంచి వైదొలగడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఆయన హఠాత్తుగా తప్పుకోకుండా తన ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు కొనసాగుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరితో ఆయన పదవి కాలం ముగియనుంది.

విభేదాలే కారణామా?

ఎన్. చంద్రశేఖరన్ ఛైర్మన్ గా ఉన్న టాటా సన్స్ సంస్థ.. టీసీఎస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సహా దాదాపు 30కి పైగా కంపెనీలను నియంత్రిస్తుంది. అయితే ఈ టాటా సన్స్‌లో 66 శాతం వాటా టాటా గ్రూప్ స్వచ్ఛంద సంస్థ అయిన ‘టాటా ట్రస్ట్స్’ చేతిలోనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రశేఖరన్‌ను తిరిగి ఛైర్మన్‌గా నియమించే ప్రతిపాదనపై నిర్ణయాన్ని టాటా సన్స్ వాయిదా వేసింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా.. చంద్రశేఖర్ నియమకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కారణంగా తెలుస్తోంది.

ఆ షరతులకు నో..

Advertisement

కంపెనీ సమావేశాల్లో టాటా సన్స్‌ను ఎప్పటికీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ (ఐపీఓ) చేయకూడదనే షరతుతో పాటు పలు నిబంధనలను నోయెల్ టాటా.. తెరపైకి తెచ్చారు. కానీ ఆ షరతుకు కట్టుబడి ఉండటానికి చంద్రశేఖరన్ నిరాకరించడమే ఈ విభేదాలకు ప్రధాన కారణమని సమాచారం. బోర్డు సభ్యుల ప్రాతినిధ్యం విషయంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మూడు దశాబ్దాల ప్రయాణం

ఎన్‌. చంద్రశేఖరన్ 1987లో టీసీఎస్‌లో సాధారణ ఉద్యోగిగా టాటా గ్రూప్‌లో చేరారు. తన ప్రతిభతో 2009లో టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా అత్యున్నత బాధ్యతలు స్వీకరించారు. అయితే గత కొద్దికాలంగా టాటా గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాపై పెరిగిన నిబంధనల ఒత్తిడి, టీసీఎస్‌లో ధరల తగ్గుదల తదితర సమస్యలు గ్రూప్‌ను ఇబ్బంది పెట్టాయి.

Advertisement

Also Read: హైటెక్ సిటీలో భారీ మాల్.. షాపింగ్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ ఒకే చోట.. సరికొత్త వీకెండ్ డెస్టినేషన్!

కుంగిన టాటా షేర్లు..

చంద్రశేఖర్ రాజీనామా నిర్ణయంతో షేర్ మార్కెట్లు టాటా షేర్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. టీసీఎస్ షేర్లు ఓ దశలో దాదాపు 6 శాతం క్షీణించి రూ.2,301.10 వద్ద కనిష్టానికి పడిపోయాయి. అటు టాటా ప్యాసెంజర్ షేర్లు సైతం 4.11 శాతం, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు, టాటా పవర్ కంపెనీ షేర్లు కూడా దాదాపు 3 శాతం మేర పడిపోయి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Also Read: రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? చౌకగా వన్ ప్లస్, ఐకూ, శాంసంగ్ మెుబైల్స్.. అమెజాన్‌లో బంపరాఫర్లు!

Tags

Related News

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

Big Stories

Advertisement
×