SRH Fan Meet: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కంటే ముందే… కీలక ప్రకటన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) అభిమానులకు శుభవార్త చెబుతూ… కీలక ప్రకటన చేసింది. త్వరలోనే… హైదరాబాద్ ఫ్యాన్స్ అందరినీ కలవబోతున్నట్లు.. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నట్లు… వెల్లడించింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ పోస్టు అధికారికంగా హైదరాబాద్ యాజమాన్యం ప్రకటన చేయలేదు. కానీ కొంతమంది సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఫ్యాన్స్ మాత్రం దీన్ని వైరల్ చేస్తున్నారు.
Also Read: IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా
ఈ ప్రకటన ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి… హైదరాబాద్ ఫ్యాన్స్ తో ప్రత్యేక మీట్ నిర్వహించనుంది యాజమాన్యం. మార్చి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అంటే దాదాపు 5 రోజులపాటు ఈ ప్రత్యేక ఫ్యాన్ మీట్ హైదరాబాదులో ( SRH Fan Meet ) ఉండనుంది. ఈ ప్రత్యేక ఫ్యాన్ మీట్ హైదరాబాద్ ప్లేయర్స్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. వేదిక ఎక్కడ అన్నది ప్రకటించలేదు కానీ ఈ కార్యక్రమం హైదరాబాద్ లోనే జరగనుంది. మార్చి 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఈ ప్రకటన వెలువడింది. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో… ఎలా ముందుకు వెళ్లాలి..? జట్టు గురించి ఎలాంటి సందేహాలు ఉన్నాయి? అలాగే… జట్టులో ఏమైనా మార్పులు చేయాలా ? ఇలా తదితర విషయాలపై హైదరాబాద్ యాజమాన్యం ఫ్యాన్స్ తో సమావేశమై చర్చించనుంది. ప్రతి జట్టుకు ఫ్యాన్స్ చాలా ముఖ్యం.
Also Read: Virat – Anushka: గ్రౌండ్ లోనే కోహ్లీ, అనుష్క రొమాం***టిక్ సైగలు.. ఫిదా కావాల్సిందే !
అందుకే ఈసారి హైదరాబాద్ యాజమాన్యం ఈ తరహాలో ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ 2024 టోర్నమెంటు సమయంలో ఫైనల్లో ఓడిపోయిన హైదరాబాద్… ఈసారి గట్టిగా కప్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటినుంచి కసరత్తులు చేస్తోంది. అటు మెగా వేలంలో కూడా కీలక ప్లేయర్లు అందరినీ కొనుగోలు చేసింది. గతంలో కంటే ఈసారి జట్టు బలంగా కూడా ఉంది. ఎందుకంటే ఇషాన్ ఈశాన్ కిషన్ బరిలోకి దిగబోతున్నాడు. మయాంక్ అగర్వాల్ ఉన్నప్పుడు పెద్దగా రాణించలేదు. కానీ ఈశాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ వెళ్ళినప్పటికీ మహమ్మద్ షమీ లాంటి డేంజర్ ఆటగాడు వస్తున్నాడు. కాగా మార్చి 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమై మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మార్చి 22వ తేదీన… కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ ఉంటుంది.