E-Paper
Advertisement

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు
Advertisement

US Pressure on Iran: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మొదలై దాదాపు ఏడు నెలలు అవుతోంది. అయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి లొంగలేదు. మెల్లగా ఆంక్షలు విధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది అగ్రరాజ్యం. ఇందులోభాగంగా బుధవారం నుంచి ఇరాన్‌కు చెందిన విమానాలపై ఆంక్షల కొరడా ఝులిపించనుంది. మరి ఈసారైనా ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అన్నది అసలు ప్రశ్న.

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత పెంచింది. ఆ దేశానికి చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయ విమానయాన వ్యవస్థ నుంచి దూరం చేసేందుకు భారీ ప్లాన్ చేసింది అగ్రరాజ్యం. సెప్టెంబర్‌ 23 అనగా బుధవారం నుంచి ఇరాన్‌ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్‌ సదుపాయాలు, టికెట్‌ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించింది అమెరికా. దీని ప్రకారం.. ఇరాన్‌ విమానాలు ఏదైనా దేశంలో దిగితే వాటికి ఇంధనం ఇవ్వడం, ల్యాండింగ్‌ సదుపాయాలు కల్పించడం, టికెట్లు విక్రయించడం చేసే సంస్థలు తమ ఆంక్షల పరిధిలోకి వస్తాయని ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ స్పష్టం చేశారు.

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు, బుధవారం నుంచి అమలు

Advertisement

ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్‌ చేసే చర్యలు చేపడతామని తేల్చిచెప్పేశారు ఆయన. నిబంధనలు అతిక్రమించిన సంస్థలను అమెరికా డాలర్‌ ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ఇరాన్‌ విమానాలు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం కష్టతరం కానుంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాక్, జార్జియా, టర్కీ వంటి దేశాలు ఇరాన్ విమానాలపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. వాటి సర్వీసులను నిలిపివేయడం ప్రారంభించాయి. జార్జియా కూడా ఇరాన్ విమానయాన సంస్థలపై నిషేధం ప్రకటించింది. టర్కీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు టర్కీకి తమ సేవలను నిలిపివేసినట్లు ఇరాన్ విమానయాన సంస్థ మహాన్ వెల్లడించింది.

ALSO READ: వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

Advertisement

తాజా ఆంక్షల హెచ్చరికపై ఇరాన్ స్పందించనప్పటికీ, ఆ దేశ విమానయాన సంస్థల కార్యకలాపాలను నిషేధిస్తూ పలు దేశాలు ప్రకటించాయి. ఏళ్ల తరబడి విధించిన ఆంక్షలు వల్ల ఇరాన్ విమానయాన రంగం కుదేలు అయ్యింది. దీంతో ఆ దేశ విమానయాన సంస్థలు కొత్త విమానాలను కొనడం, విడిభాగాలు, నిర్వహణ సేవలను పొందడం కష్టంగా మారింది. గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ముందు చైనా ఉప ప్రధాని హే లిఫెంగ్‌తో చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత బెస్సెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి ఇరాన్‌ను వేరుచేయడమే లక్ష్యంగా అమెరికా ఆంక్షలు విధించడం ఒక భాగం. ఇంధనం, షిప్పింగ్, టెక్నాలజీ, బంగారం, డిజిటల్ ఆస్తులు వంటి రంగాల్లో ఇరాన్‌తో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలు ఆ తరహా ఆంక్షల వల్ల గురయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

Related News

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

Big Stories

Advertisement
×