E-Paper
Advertisement

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!
Advertisement

Houthi Attack: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై హౌతీల క్షిపణి దాడి.. మిడిల్ ఈస్ట్‌లో కలకలం రేపుతోంది. రియాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ మిసైల్‌ను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. దాడుల నేపథ్యంలో రియాద్‌లో ఎయిర్ రైడ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి. విమానాశ్రయం సమీపంలో భారీ పొగ కనిపించడంతో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు అధికారికంగా వెల్లడించలేదు.

అమెరికా సెక్యూరిటీ అలర్ట్!

Advertisement

హౌతీల దాడులతో అమెరికా సైతం అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలోని పలు దేశాల్లో ఉన్న అమెరికా ఎంబసీలు తమ పౌరులకు సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశాయి. పరిస్థితులు వేగంగా మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించాయి. విమానాల రద్దు, ఎయిర్‌స్పేస్ మూసివేత, ప్రయాణాల్లో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉందని సూచించాయి. సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్ల దాడుల ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా ఇప్పటికే సౌదీకి సంబంధించి ప్రయాణ హెచ్చరికలను కొనసాగిస్తోంది. హౌతీల నుంచి మరోసారి దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ శాఖ తన ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. మరోవైపు.. పాకిస్థాన్ ద్వారా అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సందేశం లేదా ప్రతిపాదన తమకు అందలేదని ఇరాన్ చెబుతోంది. మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల మధ్య ఇరాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌కు US మెసేజ్ రాలేదా?

Advertisement

రియాద్‌పై హౌతీల దాడులు.. అమెరికా సెక్యూరిటీ అలర్ట్.. ఇరాన్‌కు అమెరికా నుంచి సందేశం అందలేదన్న ప్రకటన.. ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. సౌదీపై దాడులు కొనసాగితే గల్ఫ్ ప్రాంత భద్రతతో పాటు విమాన రాకపోకలు, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

Also Read: హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?

Tags

Related News

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

Big Stories

Advertisement
×