Upasana : ఉపాసన కామినేని (Upasana Kamineni).. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్.సి.రెడ్డి మనవరాలిగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ.. బిజీ లైఫ్ గడుపుతున్న ఈమె సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) ను వివాహం చేసుకొని, మెగా కోడలిగా అవతరించింది. ఎన్నో విభిన్నమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని.. బిజినెస్ ఉమెన్ గా మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన.. ఇప్పుడు మరో కొత్త బాధ్యతలు చేపట్టడం హర్షదాయకం.
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా ఉపాసన బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమాలకు ఇకపై ఉపాసన న్యాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం సుమారు రూ. 8600 కోట్ల భారీ పెట్టుబడితో తమ నెట్వర్క్ ను విస్తరించే ప్రణాళికతో ముందుకు కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం అలాగే ప్రస్తుత ఆసుపత్రుల ఆధునీకరణ వంటి ప్రాజెక్టులను ఉపాసన దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. రోగులకు అత్యుత్తమ వైద్యాన్ని, వసతులను అందించేలా హాస్పిటల్ డిజైన్ పై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా.. యాజమాన్యంతో, ప్రాజెక్టు భాగస్వామ్యులతో కలిసి పనిచేస్తూ అపోలో హాస్పిటల్స్ ను అభివృద్ధి పరచడమే తన బాధ్యత అన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించడం పై ఉపాసన స్పందించింది. “మా తాతయ్య , అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. ప్రపంచ స్థాయి వైద్యాన్ని మన ఇండియాలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆయన కల. మేము నిర్మించే ప్రతి హాస్పిటల్లో, అభివృద్ధి చేసే ప్రతి సౌకర్యంలో ఆ నమ్మకాన్ని ప్రతిబింబించేలా చూడడమే నా ప్రధాన బాధ్యత.
also read: విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!
మంచి హాస్పిటల్ డిజైన్ అనేది రోగులకు సులువుగా దారి చూపడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ.. వైద్య బృందాలు సమర్ధవంతంగా చికిత్స అందించడానికి వీలు కల్పించాలి. ఇకపై మా అపోలో హాస్పిటల్ లలో అలాంటి సౌకర్యాలే రోగులకు మేము కల్పించబోతున్నాము అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.ఇకపోతే అపోలో హాస్పిటల్స్ తో పాటు డిజిటల్ వెల్నెస్, కార్పొరేట్ ఫ్లాట్ ఫామ్ అయిన యువర్ లైఫ్ కి కూడా ఉపాసన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు..