Hyderabad Liquor Shops: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. నగరంలో మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 9, 10 తేదీల్లో మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పండుగ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రాంతాల వారీగా మద్యం షాపుల బంద్ వేళలను నిర్ణయించారు. రాజేంద్రనగర్, గోల్కొండ జోన్ల పరిధిలో ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అలాగే చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అంటే రెండ్రోజుల పాటు మందుబాబులకు మద్యం దొరకదని చెప్పవచ్చు.
Also Read: వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? IFB, Boschలలో ఏది బెస్ట్ ఛాయిస్?
పైన పేర్కొన్న నిబంధనలు నగరంలోని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లతో పాటు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకు వర్తిస్తాయని సీపీ స్పష్టం చేశారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ లోని బార్లకు మాత్రం ఈ మూసివేత ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని సూచించారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రేజీ నియామకం.. టీపీసీసీ మీడియా చైర్మన్‌గా చామల కిరణ్!