BigTV English

Bangladesh SCBA President demand: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు వర్తమానం

Bangladesh SCBA President demand: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు వర్తమానం

Bangladesh SCBA President demand: యూకె నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మాజీ పీఎం షేక్ హసీనాపై దృష్టి సారించింది బంగ్లాదేశ్. హసీనా, ఆమె సోదరి అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఆదేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భారత్‌ను కోరారు.


బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 400 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆమె సోదరి రహానాను తమకు అప్పగించాలని భారత్‌ను కోరారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖొకాన్. ఈ మేరకు ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది.

రాజధాని ఢాకాలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము భారత్‌తో స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నట్లు తెలిపారు. దయ చేసి షేక్ హసీనా, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు పంపించాల న్నారు.


ALSO READ: దారుణం.. ప్రముఖ హీరోను కొట్టి చంపేశారు!

బంగ్లాదేశ్‌లో హసీనా అనేక మరణాలకు కారణమైందని ఆయన ఆరోపించారు. మరోవైపు దేశంలో అత్య వసర పరిస్థితిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ అవినీతికి పాల్పడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారం లోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హసీనా ప్రభుత్వంలో నియమితులైన అటార్నీ జనరల్ ఏఎం అమీన్ ఉద్దీన్‌తోపాటు రాష్ట్రాల న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్ సభ్యులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతులు, అధికారులు రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లర్ల నేపథ్యంలో అరెస్టయిన యువత, రాజకీయ నేతలను తక్షణమే విడుదల చేయాలన్నది ఆయన డిమాండ్.

Related News

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Big Stories

×