Bangladesh Actor Shanto Khan: బంగ్లాదేశ్‌లో ప్రముఖ నిర్మాత సలీంఖాన్, అతని కుమారుడు, ప్రముఖ హీరో షాంటో ఖాన్‌ను దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయం బంగ్లాదేశ్‌లో ‘బంగ్లా చలనచిత్ర’ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు. షాంటో ఖాన్‌తో పాటు సలీం ఖాన్..బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్‌లో తండ్రీకొడుకులపై ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకీ తో వారిని బెదిరించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఇలా, తప్పించుకునే క్రమంలో అక్కడి ప్రజలు బగారా మార్కెట్ సమీపంలో తండ్రీకొడుకులు ఇద్దరినీ పట్టుకొని ఘోరంగా కొట్టారు. ఈ దాడిలో ఇద్దరూ మృతి చెందారు. కాగా, ఇద్దరూ స్వగ్రామం నుంచి వెళ్తుండగా.. ఆందోళనకారులు ఒక్కసారిగా దాడికి దిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
షాంటో ఖాన్..బాబూజాన్, అంటోనగర్ వంటి సినిమాల్లో నటించారు. అలాగే ఆయన తండ్రి సలీం ఖాన్ 10 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు. సలీం ఖాన్, షాంటో ఖాన్ మృతి చెందడంపై నటుడు దేవ్ స్పందించాడు. ఇద్దరి మృతి బాధాకరమని, ఈ మరణ వార్త కలిచివేసిందన్నాడు. సలీంతోపాటు షాంటో చనిపోయారనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, బంగ్లాదేశ్ లో శాంతి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని బాధను వ్యక్తం చేశాడు.
Also Read: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం
ఇదిలా ఉండగా, మరో వైపు ఢాకాలో హిందూ సంగీతకారుడు రాహుల్ ఆనంద నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అయితే ఈ ప్రమాదం నుంచి రాహుల్ ఆనందతోపాటు భార్యచ కుమారుడు తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి ముందు ఆందోళనకారులు దాదాపు 3వేలకు పైగా సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు. ఇంటి నుంచి చాలా విలువైన వస్తువులను కొంతమంది తీసుకెళ్లారు. ఢాకాలో జోలెర్ గాన్ ప్రసిద్ధ జానపద బ్యాండ్ ను రాహుల్ ఆనంద నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.