BigTV English

Best Bar : కాక్‌టెయిల్స్ క్యాపిటల్ .. వరల్డ్ బెస్ట్ బార్ ఎక్కడుందంటే ?

Best Bar :  కాక్‌టెయిల్స్ క్యాపిటల్ .. వరల్డ్ బెస్ట్ బార్ ఎక్కడుందంటే ?
best bar

Best Bar : కాక్‌టెయిల్స్ రాజధానిగా బార్సిలోనాకు పేరుంది. స్పెయిన్‌లోని ఈ నగరం మరోమారు వార్తల్లో నిలిచింది. అక్కడి సిప్స్ బార్ ప్రపంచంలోనే అత్యుత్తమ బార్‌గా అగ్రభాగాన నిలిచింది. బ్రిటన్ సంస్థ విలియం రీడ్ ఏటా ప్రపంచంలోని 50 బెస్ట్ బార్లను ఎంపిక చేస్తుంటుంది. 2009 నుంచి ఆ సంస్థ బార్లకు ర్యాంకింగ్స్ ఇస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా 680 మంది డ్రింక్ ఎక్స్‌పర్ట్స్ ఓటింగ్‌లో పాల్గొంటారు. వీరిలో ప్రముఖ బార్‌టెండర్లు, కన్సల్టెంట్లు, డ్రింక్స్ రైటర్లు, కాక్‌టెయిల్ స్పెషలిస్టులు ఉన్నారు. లాబీయింగ్‌‌ను నిలువరించాలనే ఉద్దేశంతో ఓటింగ్‌లో పాల్గొనే నిపుణుల వివరాలను 2017 నుంచి గోప్యంగా ఉంచుతున్నారు. అవార్డుల బహూకరణ కార్యక్రమం లండన్‌ తో పాటు బార్సిలోనా, కేటలోనియా, స్పెయిన్‌లలో నిర్వహిస్తూ వస్తున్నారు.

తొలిసారిగా ఈ ఏడాది ఆసియాలోని సింగపూర్‌‌లో అవార్డుల బహూకరణ జరిగింది. ర్యాంకింగ్ జాబితాలో 28 నగరాల్లోని బార్లకు చోటు లభించింది. టాప్-50 బార్లలో 11 బార్లు కొత్తవే. నిరుడు కూడా ఈ జాబితాలో బార్సిలోనా టాప్‌లో నిలిచింది. అక్కడి పరదిశో బార్ ఈ సారి నాలుగో స్థానానికి పడిపోయింది. న్యూయార్క్‌లోని డబుల్ చికెన్ ప్లీజ్, మెక్సికోకు చెందిన హ్యాండ్‌షేక్ స్పీక్ఈజీ బార్లకు 2, 3 స్థానాలు దక్కాయి.


డబుల్ చికెన్ ప్లీజ్ బార్ నిరుడు ఆరో ర్యాంక్‌లో ఉండగా.. ఈ ఏడాది రెండో స్థానానికి ఎగబాకింది. హ్యాండ్‌షేక్ స్పీక్ ఈజీ బార్ కూడా అంతే. నిరుడు 11వ ర్యాంక్‌లో ఉండగా.. ఈ సారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. లండన్‌లోని కన్నాట్‌బార్ ఐదో స్థానంలో నిలిచింది. లిటిల్ రెడ్ డోర్(పారిస్), లికోరెరియా లిమాంటూర్(మెక్సికో), టేయర్ ప్లస్ ఎలిమెంటరీ(లండన్), అల్ క్విమికో(కార్టజెనా), హిమ్‌కాక్(ఓస్లో) బార్లు తొలి పది ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×