E-Paper
Advertisement

భారత్ కు బిగ్ రిలీఫ్.. మరో నెల రోజులు నో టెన్షన్.. రష్యా చమురుపై ఆంక్షలు సడలింపు

భారత్ కు బిగ్ రిలీఫ్.. మరో నెల రోజులు నో టెన్షన్.. రష్యా చమురుపై ఆంక్షలు సడలింపు
Advertisement

Russia Oil Restrictions Relief: రష్యా చమురు కొనుగోళ్ల విషయంపై యూఎస్ యూటర్న్ తీసుకుంది. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు కొనుగోళ్లపై ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్పిన ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గింది. రష్యా చమురు ఉత్పత్తులపై మరో నెల రోజుల పాటు ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. శుక్రవారం నుంచి మే 16 వరకు రష్యా చమురును కొనుగోలు చేయడానికి అనుమతించే లైసెన్స్‌ను యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.

కొత్త లైసెన్స్ జారీ

మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో భారీగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆంక్షలు సడలించినట్లు పేర్కొంది. గతంలో జారీ చేసిన లైసెన్స్ గడువు ఏప్రిల్ 11తో ముగియనుంది. దీంతో 30 రోజుల మినహాయింపుగా కొత్త లెసెన్స్ ను జారీ చేసింది. ఇందులో ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియాతో లావాదేవీలను మినహాయించింది. ఆదివారంతో ముగియనున్న రష్యా, ఇరాన్ చమురుపై మినహాయింపును పునరుద్ధరించబోమని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల స్పష్టం చేశారు. ఇంతలో తన అభిప్రాయం మార్చుకుని రష్యా చమురు కొనుగోళ్లకు లైసెన్స్ జారీ చేసింది.

మిత్ర దేశాలు ఆందోళన

Advertisement

చమురు ఆంక్షల మినహాయింపులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, అలాగే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని అమెరికా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అభిప్రాయపడుతుంది. ఈ మినహాయింపుతో ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని నిలిపివేయడానికి పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీయడమే కాకుండా, వాషింగ్టన్, దాని మిత్రదేశాల మధ్య ఘర్షణలకు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. రష్యాపై ఆంక్షలను సడలించడానికి ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు.

ఆంక్షల సడలింపుతో ప్రపంచ చమురు సరఫరాలు తాత్కాలికంగా పెరగనున్నాయి. యూఎస్, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగాయి.

Advertisement

Also Read: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

30 రోజుల అనుమతి

ఇరాన్‌ తో తీవ్ర ఉద్రిక్తతలు వేళ.. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు భారత్ కు అమెరికా అనుమతినిచ్చింది. అప్పుడు కూడా సముద్రంలోని నౌకల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని తేల్చిచెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ మినహాయింపులు ప్రపంచ దేశాలన్నింటికీ అమలు చేసింది. ఈ ఆంక్షలు ఎత్తివేతతో 140 మిలియన్‌ బ్యారెళ్ల రష్యా చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణతో.. చమురు నౌకలకు హార్మూజ్ జలసంధిని తెరించింది ఇరాన్. ఇంతలో అమెరికా తమ నౌకాదళం హార్మూజ్ దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొంది. దీంతో ఇరాన్ మళ్లీ హార్మూజ్ దిగ్బంధించింది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×