Big Stories

Boeing flight: ఊడిన బోయింగ్‌ విమానం టైరు..బోయింగ్ ఖాతాలో మరో ప్రమాదం

Boeing flight: తరుచూ ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో నిలిచే బోయింగ్ ఖాతాలో మరో ప్రమాదం చేరింది. బోయింగ్ విమానాల గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో బోయింగ్ 737 విమానం టేకాఫ్ సమయంలో టైరు ఊడిపోయింది. ఈ ఘటన జోహెన్నెస్ బర్గ్‌లోని ఓ ఎయిర్ పోర్టులో జరగగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

- Advertisement -

జోహన్నెస్‌ బర్గ్‌లోని ఓఆర్‌ టాంబో విమానాశ్రయంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. టేకాఫ్ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ చక్రాన్ని కోల్పోయింది. విమానాశ్రయం నుంచి బయలు దేరిన కాసేపటికే చక్రం దెబ్బతిన్నా..ఫ్లైట్ రన్‌వే పై ల్యాండ్ అయింది. ఈ సమయంలోనే విమానం టైరు నుంచి పొగ రావడం ప్రారంభమయింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దీంతో బోయింగ్‌పై మరో సారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Also Read: పాక్‌కి అమెరికా వార్నింగ్, అసలేం జరిగింది?

ఈ ఘటనపై దక్షిణాఫ్రికా విమానయాన సంస్థ స్పందించింది.ఫ్లైట్ టేకాఫ్‌ సమయంలో చక్రం దెబ్బతిన్నా సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ముందుగా తమ సిబ్బంది విషయాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశారని అన్నారు. ఇప్పటికే బోయింగ్‌ విమానాల పని తీరుతో పాటు వాటిలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలపై కంపెనీ పలు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News