Deadly trend : సోషల్ మీడియాలో వచ్చే అర్థం పర్థం లేని ఛాలెంజ్ లు చేస్తూ.. ఇప్పటికే అనేక మంది మృత్యువాత పడ్డ సంగతి తెలుసు. అలాంటి ఛాలెంజ్ లోనే ఓ బ్రెజిలియన్ యువకుడు మృత్యువాత పడినట్లుగా వైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. బ్రెజిల్ లో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ గా మారిన ఓ ఛాలెంజ్ లో సీతకాక చిలుకను చంపి, దానిని నీటిలో కలిసి.. ఆ నీటిని సిరల్లోకి ఎక్కించుకుంటున్నారు. అలానే.. ఈ యువకుడు చనిపోవడంతో.. ఇతనూ ఛాలెంజ్ లో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే..ఇంకా పూర్తిగా నిర్థరణ కాలేదని చెబుతున్నారు. సీతాకోకచిలుక అవశేషాలను శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకోవడంతో.. తీవ్రమైన అలెర్జీ, ఇన్ఫెక్షన్ కారణంగా ఈ యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
న్యూయార్క్ పోస్టు ప్రకారం.. 14 ఏళ్ల డేవి నూన్స్ మోరీరాట అనే యువకుడు కొన్నిరోజుల క్రితం తీ్వ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. ఏడు రోజుల పాటు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా విటోరియా డి కాంక్విస్టాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో విపరీతమైన నొప్పితో విలవిలాడాడు అని వైద్యులు వెల్లడించారు. వైద్యుల పరిశీలనలో ఆ యువకుడు.. చనిపోయిన సీతాకోక చిలుకను నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని తన కాలి దగ్గర నరంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నట్లు గుర్తించారు. మొదట్లో విషయం చెప్పని బాధిత యువకుడు.. ఆ తర్వాత అసలు విషయాన్ని అంగీకరించాడు. అతడిని కాపాడేందుకు చివరి వరకు శ్రమించిన వైద్యులు.. అతని శరీరంలో వ్యాపించిన తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా.. కాపాడుకోలేకపోయామని అన్నారు. అయితే.. అతను సోషల్ మీడియా ఛాలెంజ్‌లో పాల్గొన్నాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదన్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీతాకోక చిలుక మిశ్రమాన్ని రక్తంలోకి ఎక్కించుకోవడంతో.. టీనేజర్ ఎంబోలిజం, ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీకి గురయ్యాడని అంటున్నారు. అయితే.. ఆ టీనేజర్ శరీరంలోకి ఎక్కించుకున్న మిశ్రమాన్ని ఎలా తయారు చేశాడో స్పష్టత లేదని అంటున్నారు. అలాగే.. అతను శరీరంలోకి ఎంత పరిమాణంలో ఇంజెక్ట్ చేసుకున్నాడో కూడా తెలయని కారణంగా సరైన వైద్యం అందించడం కష్టంగా మారిందని తెలిపారు. ఇంజక్షన్ కారణంగా నరాల్లోకి గాలి వెళ్లి ఉండొచ్చని, దాంతో.. ఎంబోలిజానికి దారితీసి ఉండొచ్చని అంటున్నారు. రక్తనాళంలో ఎంబోలిజం లేదా అడ్డంకి ఏర్పడటం వల్ల ఆకస్మిక మరణం సంభవిస్తుందని తెలుపుతున్నారు. అతను సెప్టిక్ షాక్‌లోకి వెళ్లి.. శరీరం స్తబ్దుగా మారడానికి కారణం.. సీతాకోకచిలుక మిశ్రమంలోని విషపదార్థాలే అయ్యి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా పూర్తి పోస్ట్‌మార్టం రిపోర్టులు రావాలని అంటున్నారు.
Also Read : Israel Buses Explode : మరోసారి ఉలిక్కిపడ్డ ఇజ్రాయిల్ – ఒకేసారి మూడు బస్సులు పేల్చేసిన ఉగ్రవాదులు