SA vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో ( Champions trophy 2025 )… మరో భారీ విజయం నమోదయింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ( afghanistan ) చిత్తు చిత్తు చేసింది సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ లో ఏకంగా 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ( South Africa ) భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన… దక్షిణాఫ్రికా టీం… 315 పరుగులు చేయడం జరిగింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… కుప్పకూలింది ఆఫ్గనిస్తాన్. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో… దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రహమత్ షా ( Rahmat Shah ) 90 పరుగులు చేసిన మిగతా ప్లేయర్స్ సరిగా ఆడకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడింది.
107 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో… మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టులో… బ్యాటర్లు అలాగే బౌలర్లు ఇద్దరూ రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ మ్యాచ్ లో 316 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… ఆఫ్ఘనిస్తాన్ టీం కాస్త పోరాడిందని చెప్పవచ్చు. కానీ చివరికి.. రహమత్ షాకు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఓడిపోవడం జరిగింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైనా అడిగి ఉంటే… మ్యాచ్ మలుపు తిరిగేది. కానీ 43.3 ఓవర్లలోనే… 208 పరుగులకు కుప్పకూలింది ఆఫ్ఘనిస్తాన్. ఇక ఆఫ్గనిస్తాన్ టీం లో వికెట్ కీపర్ రహమదుల్లా గుర్బాజ్ కేవలం పది పరుగులకు అవుట్ అయ్యాడు.
మరో ఓపెనర్ ఇబ్రహీం రబడ బౌలింగ్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మూడవ వికెట్ కు వచ్చిన అటల్ ను మార్కో జాన్సన్ రనౌట్ చేశాడు. రహమత్ షా 92 బంతుల్లో 90 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు అలాగే ఒక సిక్సర్ ఉంది. ఇక ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ డక్ అవుట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన కెప్టెన్ ఒక్క పరుగు కూడా చేయలేదు. సఫారీ బౌలర్ మల్డర్ చేతికి చిక్కాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో…. కాసి గో రబాడ మూడు వికెట్లు పడగొట్టాడు. మల్డర్ రెండు వికెట్లు అలాగే లుంగీ ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. మార్కో జాన్సన్ ఒక వికెట్ అలాగే కేశవ్ మహారాజ్ మరో వికెట్ తీశాడు.
ఇలా ఐదుగురు బౌలర్లు రాణించడంతో సౌత్ ఆఫ్రికా… భారీ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. ఈ విజయంతో గ్రూప్ బి లో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు… మొదటి విజయాన్ని నమోదు చేసుకొని రెండు పాయింట్లు దక్కించుకుంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ పొజిషన్ లోకి వెళ్లింది. ఇక రేపు ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్ గా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా మరొక మ్యాచ్ గెలిస్తే సెమిస్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ మరొక మ్యాచ్ ఓడిపోతే కచ్చితంగా ఇంటికి వెళ్తుంది.
Also Read: Rashid Khan Run-out: దరిద్రం అంటే ఇదే.. బ్యాట్ పెట్టినా ఔట్ అయ్యాడే ?