BigTV English

Trump Deport Venezuela Immigrants: వెనిజులా క్రిమినల్స్‌ను వెనక్కు పంపుతున్నాం.. అక్రమవలసదారులపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు

Trump Deport Venezuela Immigrants: వెనిజులా క్రిమినల్స్‌ను వెనక్కు పంపుతున్నాం.. అక్రమవలసదారులపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు

Trump Deport Venezuela Immigrants| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎల్లవేళలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే అమెరికాలో నివసించే అక్రమ వలసదారులను వెనక్కు పంపించేస్తానని చెబుతూ వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించగానే ఈ దిశగానే వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెక్సికో, బ్రెజిల్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వందల సంఖ్యలో అమెరికా నుంచి వారి దేశాలకు తిరిగి డిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో సౌత్ అమెరికా దేశమైన వెనిజులా వంతు వచ్చింది.


ఇటీవలే అమెరికాకు చెందిన ప్రత్యేక దౌత్యాధికారి రిచార్డ్ గ్రినెల్.. వెనిజులా రాజధాని కరాకాస్ నగరానికి వెళ్లి అక్కడి దేశాధ్యక్షుడు నికోలాస్ మడూరోతో చర్చలు జరిపారు. ఈ చర్చల తరువాత వెనిజులాలో బందీలుగా ఉన్న ఆరుగురు అమెరికన్లను విడుదల చేసేందుకు వెనిజులా ప్రెసిడెంట్ మడూరో అంగీకరించారు. దీంతో పాటు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న అందరు వెనిజులా పౌరులను తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు కూడా పంపనున్నారు. అయితే గత సంవత్సర కాలం నుంచి వెనిజూలా, అమెరికా దేశాల విమాన రాకపోకలపై నిషేధం ఉంది. ఇప్పుడు రిచార్డ్ గ్రినెల్‌తో చర్చలు చేశాక.. విమానాల రాకపోకలు మళ్లీ ప్రారంభం కానున్నాయని సమాచారం.

Also Read: వెలికి తీసి చంపుతాం.. సోమాలియాలో ఐసిస్ సూత్రధారి హతం.. ట్రంప్ ట్వీట్


ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ చేశారు. “వెనిజూలా ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను వెనక్కు రప్పించేందుకు అంగీకరించింది. ఇందుకోసం ఆ దేశమే విమానాలు పంపనుంది. అమెరికాలో అక్రమంగా నివసించే ఈ ఏలియన్స్ (గ్రహాంతార వాసులు), ఈ క్రిమినల్స్ (నేరస్తులు) ముఖ్యంగా వెనిజులాకు చెందిన ట్రెన్ డి అరగ్వా అనే క్రిమినల్ గ్యాంగ్ సభ్యులను వెనిజులాకు తిరిగి పంపిచేస్తున్నాం. వెనిజులా ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.” అని తన పోస్ట్ లో ట్రంప్ రాశారు. అయితే వలసదారులందరినీ ట్రంప్ ఏలియన్స్, క్రిమినల్స్ అంటూ పరుషంగా సంబోధించడం గమనార్హం.

వెనిజూలాలో గత సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ విజయం సాధించిందని కానీ ఎన్నికల అధికారులు, సైన్యాధికారులు అధికారంలో ఉన్న మడూరోతో చేతులు కలిపి ఆయననే తిరిగి విజేతగా ప్రకటించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అమెరికా కూడా మడూరో ప్రభుత్వానికి గుర్తింపు నివ్వలేదు. అయితే ఈ చర్చల తరువాత అమెరికా మడురోను వెనిజూలా అధ్యక్షుడిగా అంగీకరించేందుకు సిద్ధపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షరతుల మేరకే మడూరో అమెరికా నుంచి వలసదారులను తిరిగి రప్పించేందుకు, ఆరుగురు అమెరికా బందీలను విడుదల చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

వెనిజూలాలో మడూరో గత కొంత కాలంగా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. అందుకే అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెనిజూలాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ మెరుగైన జీవితం కోసం అమెరికా, కెనెడా దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. మడూరోకు ఎదురు తిరిగినవారందరూ అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారని సమాచారం. ఫోరో పీనల్ అనే వెనిజూలాక చెందిన మానవ హక్కుల సంస్థ రిపోర్ట్ ప్రకారం.. వెనిజూలా జైళ్లలో దాదాపు 1408 మంది రాజకీయ బందీలు ఉన్నారు.

అయితే ట్రంప్ అమెరికాలో తన అక్రమ వలసల పాలసీని విజయవంతం చేసేందుకు వెనిజూలా అధ్యక్షుడితో డీల్ చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×