E-Paper
Advertisement

పాక్‌లో కుప్పకూలిన చైనా ఫైటర్ జెట్.. డ్రాగన్ టెక్నాలజీపై మళ్లీ అనుమానాలు!

పాక్‌లో కుప్పకూలిన చైనా ఫైటర్ జెట్.. డ్రాగన్ టెక్నాలజీపై మళ్లీ అనుమానాలు!
Advertisement

Fighter Jet Crash: పాకిస్తాన్ వైమానిక దళానికి (PAF) చెందిన చైనా తయారీ ‘జేఎఫ్-17 థండర్’ (JF-17 Thunder) యుద్ధ విమానం అనూహ్యంగా కుప్పకూలింది. కమ్రాలోని పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ (PAC) సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు పాక్ మీడియా పేర్కొంది. అయితే చైనా మూలలు ఉన్న ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడంతో మరోవైపు డ్రాగన్ టెక్నాలజీపై అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి.

ఫైటర్ జెట్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే ఇద్దరు పైలెట్లు అప్రమత్తమై ఎజెక్ట్ (Eject) అవ్వడంతో ప్రాణనష్టం తప్పిందని పాక్ మీడియా తెలిపింది. అయితే వారికి తీవ్ర గాయాలైనట్లు స్పష్టం చేసింది. జెట్ జనావాసాల్లో కూలినప్పటికీ ఈ ప్రమాదంలో సామాన్య పౌరులు ఎవరు గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పాక్ వైమానిక వర్గం కూడా తెలియజేసింది.

Advertisement

ఇదిలాఉంటే ప్రమాదానికి ముందు రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైటర్ జెట్ నేలను బలంగా ఢీకొట్టే క్షణాల ముందే.. ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయ్యి పారాచ్యూట్ ల సాయంతో గాల్లోకి ఎగిరారు. అయితే ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు నేలను ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జెట్ కూలిన ప్రాంతానికి జనం పరుగున వెళ్తుండటం కూడా వైరల్ వీడియోలో స్పష్టం కనిపించింది.

Advertisement

మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీమ్స్, స్థానిక యంత్రాంగం వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సురక్షితంగా పారాచూట్ ద్వారా కిందకు దిగిన పైలట్లను రక్షించి వారికి ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం సైనిక ఆసుపత్రికి తరలించాయి. ఈ ప్రమాదంలో సాధారణ పౌరులకు ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని పాక్ అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పాకిస్థాన్ వైమానిక దళం ఉన్నత స్థాయి ‘బోర్డ్ ఆఫ్ ఇంక్వైరీ’ (Board of Inquiry)కి ఆదేశించింది.

Also Read: మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. బొక్కబోర్ల పడ్డ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లో విచిత్ర ఘటన!

చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ జేఎఫ్-17 యుద్ధ విమానాలు వరుసగా ప్రమాదాలకు గురికావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ పలుమార్లు ఈ రకమైన విమానాలు సాంకేతిక లోపాలు, ఇంజిన్ వైఫల్యాల వల్ల కూలిపోయాయి. తాజాగా జరిగిన ఈ ప్రమాదంతో చైనా సరఫరా చేస్తున్న రక్షణ సాంకేతికత, విడిభాగాల నాణ్యతపై మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Also Read: మీ పాత ఫోన్‌ను.. సూపర్ ఫాస్ట్‌గా మార్చేసే.. అద్భుతమైన ‘స్మార్ట్’ చిట్కాలు!

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×