BigTV English

Famous Conjoined Twins: అవిభక్త కవలలకు ఆర్మీ అధికారితో పెళ్లి..

Famous Conjoined Twins: అవిభక్త కవలలకు ఆర్మీ అధికారితో పెళ్లి..
Conjoined twins


Conjoined Twins Abby, Aensel Is Now Married To An Army Vetaran: అమెరికాకు చెందిన అవిభక్త కవలలు అబ్బి-బ్రిటనీ హాన్సెల్ (కంజోయన్డ్ ట్విన్స్) ఆర్మీ వెటరన్ జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. 1996 లో వీరిద్దరు “ది ఓప్రా విన్‌ఫ్రే” షోలో కనిపించి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ అవిభక్త కవలలు వారి జీవితంలో ఒక ప్రధాన మైలురాయిని చేరుకున్నారు. యూఎస్ ఆర్మీ రిటైర్డ్ అధికారిని పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మిస్టర్ బౌలింగ్‌తో కలిసి కవలలు వివాహ నృత్యాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఫొటోలో కనిబడుతుంది. ఈ కవలలు వివాహ దుస్తులను ధరించి ఉండగా, మిస్టర్ బౌలింగ్ బూడిద రంగు సూట్‌లో ఉన్నాడు.


Also Read: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్.. 42 మంది మృతి

బ్రిట్నీ హాన్సెల్ ఫేస్‌బుక్ పేజీ లో వారి ఫొటోలు కనిపించాయి. దీనిలో వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడం చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవతరగతి విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు. ఈ అవభక్త కవలలు మిన్నెసోటాలోని వీరి స్వస్థలంలో నివసిస్తున్నారు.

మరోవైపు జోష్ బౌలింగ్‌ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో అతను వారిద్దిరికి  ఐస్‌క్రీమ్‌ను అందిస్తున్నట్లు, కలిసి ప్రయాణిస్తున్నట్లు, వెకేషన్ ఫొటోలు ఉన్నాయి. వారి పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చాయి. ఈ వీడియోలో వారు డాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అబ్బి-బ్రిటనీ హాన్సెల్ శరీరం కలిసిపోయి ఉంటుంది. శారీరం ఒక్కటే.. తలలు మాత్రం వేరు వేరు గా ఉంటాయి. అబ్బి కుడి చేయి, కుడి కాలును నియంత్రిస్తుంటుంది. బ్రిటనీ హాన్సెల్ ఎడమవైపు అవయవాలను నియత్రిస్తుంటుంది.

Tags

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×