BigTV English

Consumer Class: ఈ-కామర్స్‌తో.. కొత్త వినియోగదారులు..

Consumer Class: ఈ-కామర్స్‌తో.. కొత్త వినియోగదారులు..

Consumer Class: ప్రపంచ వినియోగదారుల వర్గం వేగంగా విస్తరిస్తోంది. జూన్ 2023 నాటికి ఈ వర్గం పరిధిలోకి 4 బిలియన్ల మంది చేరారు. 2031 నాటికి ఈ సంఖ్య 5 బిలియన్లకు చేరుతుందని అంచనా.


రోజుకు 12 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.998 ఖర్చు పెట్టగల స్థోమత ఉన్న వారిని కన్య్సూమర్ క్లాస్‌గా పరిగణించొచ్చని వరల్డ్ డేటా లాబ్ చెబుతోంది. వచ్చే ఏడాదికి 113 మిలియన్ల మంది కొత్తగా ఈ గ్రూప్‌లోకి రానున్నారు.

వీరిలో అత్యధికులు అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే. ఆసియా నుంచి 91 మిలియన్ల మంది వినియోగదారులు కొత్తగా జత కూడనున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి 10 మిలియన్లు, లాటిన్ అమెరికా నుంచి 6 మిలియన్లు, మిగిలిన ప్రపంచదేశాల నుంచి 5 మిలియన్ల మంది ఈ జాబితాలో చేరనున్నారు.


ఆసియాలో కొత్తగా చేరే వినియోగదారులు దేశాల వారీగా చూస్తే చైనా, భారత్ టాప్ రెండు స్థానాల్లో ఉంటాయి. చైనా నుంచి 31 మిలియన్లు, భారత్ నుంచి 33 మంది మిలియన్ల మంది కొత్త వినియోగదారులు రానున్నారు.

ఇండొనేసియా 5 మిలియన్ల మంది, బంగ్లాదేశ్ 5 మిలియన్లు, వియత్నాం 4, పాకిస్థాన్ 3, ఫిలిప్పీన్స్ 2, తుర్కియే, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఒక్కో మిలియన్ చొప్పున కొత్తగా వినియోగదారులు పుట్టుకొస్తారని అంచనా. ఇందుకు కారణం.. ఆయా దేశాల్లో ఈ-కామర్స్ మార్కెట్లు శరవేగంగా విస్తరిస్తుండటమే.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×