BigTV English

Allu Arjun with Allu Arjun: పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్.. ఒరిజినల్ ఎవరో గుర్తుపట్టండి..!

Allu Arjun with Allu Arjun: పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్.. ఒరిజినల్ ఎవరో గుర్తుపట్టండి..!
Allu Arjun wax statue
Allu Arjun

Allu Arjun with Allu Arjun’s Wax Statue: ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు అల్లు అర్జున్. అయితే తాజాగా ఈ హీరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నాడు. ఇదివరకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా సంచలనం సృష్టించిన బన్నీ.. ఇప్పుడు మరొక మైలు రాయిని అందుకున్నాడు.


ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్నాయి. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విగ్రహం వచ్చి చేరింది. అయితే అది లండన్‌లో కాదు దుబాయ్‌లో.

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా దీనిని మార్చి 28న అంటే బన్నీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి రిలీజ్ రోజున ఓపెనింగ్ చేశారు. దీంతో తన ఫస్ట్ మూవీ రిలీజ్ రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ తెలిపాడు.


కాగా ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ ధరించి పుష్ప మేనరిజంతో తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. అయితే అలాంటి కాస్ట్యూమ్‌నే ధరించి బన్నీ ఆ ఓపెనింగ్‌కి వెళ్లాడు.

Also Read: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..

https://twitter.com/bunnyakansha/status/1773416121309499692

ఆ విగ్రహం ఓపెనింగ్ అనంతరం బన్నీ, ఆ విగ్రహం పక్కపక్కన నిల్చున్న ఫోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో రియల్ బన్నీ ఎవరనేది పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి.

ఇకపోతే బన్నీ ప్రస్తుతం ‘పుష్ప2’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కడంతో సెకండ్ పార్ట్‌ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక అన్ని పనులు పూర్తి చే సుకుని ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×