Trump 2.0: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మరో రెండు నెలల్లో కొలువు దీరనుంది. దీనికి తెర వెనుక పనులు చకచకా జరుగుతోంది. ట్రంప్ గెలుపు వెనుక ఈసారి అక్కడి భారతీయులు కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా వాళ్లంతా వ్యాపారాలు, రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. అందులో కొందరు ట్రంప్ సర్కార్‌లో చోటు దక్కే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరు? అన్నదానిపై డీటేల్‌గా ఓ లుక్కేద్దాం.
పైన కనిపిస్తున్న నలుగురు వ్యక్తులు భారత సంతతికి చెందినవారు. ఎడమ నుంచి చూస్తే ఒకరు కశ్యప్ పటేల్, తులసీ గబార్డ్, బాబీ జిందాల్, వివేక్ రామస్వామి. వీరిందరికీ ట్రంప్ ప్రభుత్వంలో అవకాశం దక్కవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో రిపబ్లికన్ నేతలు ట్రంప్ టీమ్‌ను కూర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఓకే అయ్యింది. పార్టీ నేతలతోపాటు భారత సంతతికి చెందినవారు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో కీలకమైన వ్యక్తి వివేక్ రామస్వామి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్‌తోపాటు వివేక్ రామస్వామి పోటీపడ్డారు. చివరి వరకు వివేక్ రేసులో నిలిచారు. ఆఖరికి తన మద్దతును ట్రంప్‌కు ప్రకటించి రేసు నుంచి డ్రాపయ్యారు. వివేక్ ఓ బిజినెస్‌మేన్ మాత్రమేకాదు రిపబ్లికన్ నేత కూడా. ఆయనకు అమెరికాలో బయోటెక్ కంపెనీలున్నాయి. ఆయనకు కీలకమైన పదవి అప్పగించాలనే ఆలోచన చేస్తోంది ఆ పార్టీ.
ALSO READ: గ్రీన్ కార్డులు, హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ దూకుడు.. మనకు లాభమా.? నష్టమా.?
రిపబ్లికన్ పార్టీ నేతల్లో సీనియర్ బాబీ జిందాల్. జార్జిబుష్ హయాం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న కీలక నేత. లూసియానా మాజీ గవర్నర్ అయిన బాబీ జిందాల్, ట్రంప్ ప్రభుత్వంలో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొత్త తరం నేతలను తెరపైకి తెచ్చే క్రమంలో ఈయన పేరు వెలుగులోకి వచ్చింది.
కనిపిస్తున్న ఈమె పేరు తులసీ గబార్డ్. భారత సంతతికి చెందిన మహిళ. అయితే పార్టీ జంప్ అయిన నేత. తొలుత డెమోక్రటిక్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత రిపబ్లికన్ వైపు మొగ్గు చూపారు. అంతేకాదు ట్రంప్ టీమ్‌లో చురుగ్గా పని చేసే మహిళల్లో ఈమె కూడా ఒకరు. సింపుల్‌గా చెప్పాలంటే ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల్లో ఆమె కూడా ఒకరన్నమాట.
కశ్యప్ పటేల్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి. స్వతహాగా ఆయనొక న్యాయవాది. ట్రంప్‌కు విధేయుడనే ప్రచారం లేకపోలేదు. గతంలో ట్రంప్ హయాంలో ఆదేశ జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక విభాగం డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు కీలక పదవి ఇస్తారని అంటున్నాయి రిపబ్లికన్ పార్టీ వర్గాలు.