BigTV English

US Visa Issue : గ్రీన్ కార్డులు, హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ దూకుడు.. మనకు లాభమా.? నష్టమా.?

US Visa Issue : గ్రీన్ కార్డులు, హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ దూకుడు.. మనకు లాభమా.? నష్టమా.?

US Visa Issue : నాయకులు మారుతుంటే వారి విధానాలు మారుతుంటాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంలో అయితే.. వారి ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటాయి. అందుకే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. విధానపరమైన నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి.? వీసా, గ్రీన్ కార్డు వంటి అంశాల్లో ఎలా వ్యవహరించనున్నారు అన్నది ఆసక్తిగా మారింది.


ఎన్నికల్లో మెజార్టీ మార్క్ ఫలితాలు వస్తున్న సందర్భంలో నిర్వహించిన విజయోత్సవ సభలో అమెరికాలోకి విదేశీయులను స్వాగతిస్తామన్న ట్రంప్.. వారంతా చట్టప్రకారం రావాలని వెల్లడించారు. దాంతో.. ఆయన విధానాల ఎలా ఉండనున్నాయో.. ఓ స్పష్టత వచ్చినట్లైంది. మొదటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్ కఠినంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ.. ఆయన ప్రచారం ఎక్కువగా ఇమిగ్రేషన్స్ విధానాలపైనే కొనసాగింది. బైడెన్ – కమలా హ్యారిష్… నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ, సరైన ఇమ్మిగ్రేషన్ విధానాల్ని అవలంభించడం లేదని ఆరోపిస్తూ వచ్చారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి చొరబడిన వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించారని చెబుతూ వచ్చారు. ఆ ప్రచారాన్నే విశ్వసించిన ప్రజలు, ట్రంప్ ఆలోచనలకు అంగీకారం తెలిపినట్లు.. ఈ ఫలితాలు సూచిస్తున్నట్లు ట్రంప్ భావిస్తున్నారు.

తన హయంలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్.. కేవలం నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే దేశంలో చోటు అని ప్రకటించారు. అందుకు తగ్గట్టే.. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ఓ డ్రాఫ్ట్ రూపొందించారు. ట్రంప్ ఆలోచనల ప్రకారం.. ఆ డ్రాప్ అమల్లోకి వస్తే అమెరికాలోకి ప్రవేశం కఠినమవుతుందని చాలా మంది భావించారు. ముఖ్యంగా H-1B, F-1, H-4 వీసాలపై ఆశలు పెట్టుకున్న వాళ్లు ఆందోనళ చెందారు. అయితే.. ఇప్పుడు ట్రంప్ విధానాల్లో మార్పులు రావచ్చని, మారిన అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా.. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మరింత స్పష్టంగా వ్యవహరించవచ్చని.. కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.


నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అమెరికా ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది అనే ట్రంప్.. చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే మాత్రం ఒప్పుకోనేది లేదనేది మొదటి నుంచి అవలంభిస్తున్న విధానం. అలా.. విదేశీయుల్ని, వలసవాదుల్ని పోత్సహించడం వల్లే.. లండన్, పారిస్ లలో చెలరేగుతున్న హింసకు కారణాలనేది ట్రంప్ అభిప్రాయం. అలాగే.. అమెరికా చెత్త కుప్ప కాదని, ఎవరిని పడితే వారిని దేశంలోకి అంగీకరించేది లేదనేది.. ట్రంప్ విధానం.

భారతీయులపై ప్రభావం ఎలాంటిది
ప్రస్తుతం విధానాల్లో అమెరికాకు వలస వెళ్లిన ఎవరైనా.. అక్కడి పౌరసత్వం లభిస్తే కుటుంబ ఆధారత ఇమిగ్రేషన్ విధానంలో, వారి భర్త/భార్య, వారి పిల్లలకు కూడా పారసత్వం లభిస్తుంటుంది. అయితే ట్రంపు మాత్రం దీనివల్ల దేశానికి నష్టం అని అంటున్నారు. నైపుణ్యం ఉన్న ఒకరి వల్ల.. మిగతా వారికి దేశంలో చోటు కల్పించడం మంచిది కాదు అంటున్నారు. ఇది.. ఆ తర్వాత అమెరికాకు రావాలనుకునే నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఆరోపిస్తున్నారు. అందుకే.. కుటుంబ ఆధారత ఇమ్మిగ్రేషన్ పాలసీ కంటే వ్యక్తిగత ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది ట్రంప్ ఆలోచన.

కొన్ని గణాంకాల ప్రకారం అమెరికాలో 10 మిలియన్ల మంది అంటే దాదాపు కోటి మందికి పైగా ప్రజలు.. ఎటువంటి చట్టపరమైన కాగితాల లేకుండా అక్రమంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్.. వలసదారులపై కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉందని అంచనాల వినిపిస్తున్నాయి. అయితే భారతీయులు చాలావరకు చట్టపరమైన మార్గాల ద్వారానే అమెరికాలోకి అడుగు పెడుతూ ఉంటారు. అక్కడ పనిచేసేందుకు H1B వీసాలు, చదువుల కోసం F-1 వీసాలు పొందుతుంటారు. దాంతో మనకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చన్నది విదేశీ వ్యవహారాలను పరిశీలించే నిపుణుల మాట.

Also Read :

అయితే.. ట్రంప్ వ్యవహారంతో ఇప్పటికే అక్కడ స్థిరపడిన కొంతమందికి మాత్రం ఇది ఇబ్బంది కావచ్చని చెబుతున్నారు. కొత్తగా అమెరికాలకు ప్రవేశించాలనుకునే నైపుణ్యాలున్న విద్యార్థులకు మాత్రం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కానీ.. అధికారం చేపట్టిన వెంటనే ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఎలాంటి మార్పు చేర్పులు జరిగే అవకాశం లేదని.. అందుకోసం కనీసం 6 నెలల సమయం పట్టొచ్చనేది ఇమ్మిగ్రేషన్ విధానాలపై అవగాహన వ్యక్తులు చెబుతున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×