BigTV English

Donald Trump: కమలా హారిస్ కంటే నేనే అందంగా ఉంటా: ట్రంప్

Donald Trump: కమలా హారిస్ కంటే నేనే అందంగా ఉంటా: ట్రంప్

ఇది అమెరికాలోని పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ.. అందులో ది వాల్ స్ట్రీట్ జర్నల్ లో హ్యారీస్ అందాన్ని అభివర్ణిస్తూ ఓ ఆర్టికల్ రాశారు. దానిని ఉద్దేశించి ట్రంప్ హ్యారీస్ కంటే తాను చూడటానికి బాగుంటానని అన్నారు. అంతటితో ఊరుకోకుండా. మ్యాగజైన్ పై ఉన్నది హీరోయిన్స్ సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అని వెక్కిలి మాటలు మాట్లాడారు. స్త్రీలు అందంగా ఉన్నారని ఎప్పుడూ పొగడవద్దని. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు అవుతుంది నోరుపాసేసుకున్నారు. దీంతో ఇది రాజకీయ రచ్చకు దారి తీసింది.

మరి ప్రత్యర్థి మాటలకు ఇటు సైడ్ నుంచి కూడా కౌంటర్ పడాలి కదా.. ట్రంప్ మాటలకు కమల కూడా రియాక్ట్ అయ్యారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడేవారంతా తన దృష్టిలో పిరికివారేనని ఫైర్ అయ్యారు. ఈమధ్య కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టడం అనేది నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రజల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులని అన్నారు. నిజానికి కమలపై ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటిసారి కాదు.


Also Read: ట్రంప్ ప్రకటన.. కేబినెట్‌లో మస్క్ ఛాన్స్..

కొన్నిరోజుల నుంచే కమలా పై డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. కమలా హారిస్ నల్ల జాతీయురాలా? భారతీయ సంతితికి చెందిన వ్యక్తో చెప్పాలంటూ గతంలో ప్రశ్నించారు. తనపై కూడా కమలా హారిస్ తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిందని. అందువల్లనే అలా మాట్లాడినట్లు ట్రంప్ సమర్ధించుకున్నారు. మరి కమలపై ఎందుకింత కోపం అంటే.. ఆమె దూకుడు ప్రదర్శించడం. పలు సర్వేలు కమలాకే మొగ్గు చూపడం ట్రంప్ కు రుచించడం లేదంట. నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమల విజయమే తధ్యమనే మాట వినిపిస్తుంది. అందుకే ట్రంప్ ఫ్రస్టెషన్ లో మాట్లాడుతున్నారని డెమొక్రాటిక్ లీడర్లు అంటున్నారు.

మ్యాటర్ ఏదైనా ఈ విధంగా ట్రంప్ వ్యక్తిగత దూషణకు దిగడం తప్పే.. ఇప్పటికే నోటి దురుసుతో ఓ సారి ఓటమి చవిచూసిన ట్రంప్ .. మళ్లీ అదే రూట్ లో వెళ్లడం కుక్క తోక వంకర అనే సామెత ను గుర్తుకు తెస్తుంది. ట్రంప్ మాటలకు తాళం దేవుడెరుగు.. పార్టీకి ఎలా డ్యామేజ్ తేస్తుందోనని రిపబ్లికన్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు టైం కూడా దగ్గర పడుతుంది. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ప్రచారానికి ఇంకా రెండు నెలలకు పైగా టైమ్ ఉంది. అప్పుడే ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలతో కంపు రేపుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×